పుట:చిరస్మరణీయులు, మొదటి భాగం.pdf/186

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

183

83. డాక్టర్‌ సయ్యద్‌ మహమ్మద్‌

( 1889-1971)

భారత స్వాతంత్రోద్యమం చివరి దశలో ఉనికిలోకి వచ్చిన ద్విజాతి సిద్ధాంతం, పాకిస్థాన్‌ భూభాగం ముస్లింల స్వంత గడ్డగా సాగిన ప్రచారం భారతీయలు భవిష్యత్తుకు ప్రమాదకరమని ప్రజానీకాన్నిహెచ్చరించి, మాతృభూమి ముక్కలు కాకుండేందుకు చివరి క్షణం వరకు కృషి చేసిన నాయకులలో డాక్టర్‌ సయ్యద్‌ మహమ్మద్‌ ఒకరు.

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం, ఘాజిపూర్‌ జిల్లా సయ్యద్‌పూర్‌ గ్రామంలో జమీందారి కుటుంబంలో సయ్యద్‌ మహమ్మద్‌ 1889లో జన్మించారు. అలీఘర్‌లో చదువుతున్నప్పుడు, బ్రిటిష్‌ ప్రిన్సిపాల్‌ చర్యలకు వ్యతిరేకంగా సాగిన సమ్మెలో చురుకైన పాత్ర నిర్వహించి కళాశాల నుండి బహిష్కరణకు గురయ్యి ఆంగ్ల ప్రభుత్వ వ్యతిరేకిగా పరిగణించబడ్డారు.

1905లో బెనారసలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్‌ సమావేశంలో తొలిసారిగా పాల్గొన్నారు. ఆల్‌ ఇండియా ముస్లింలీగ్ ఏర్పాటైన తొలిరోజులలో ఆయన లీగ్ లో క్రియాశీలక పాత్ర నిర్వహించారు. 1911లో న్యాయశాస్త్రంలో డాక్టర్ డిగ్రీని పొందిన ఆయన పాట్నాలో ప్రాక్టీస్‌ ప్రారంభించారు. 1915లో బొంబాయిలో జరిగిన లీగ్ సమావేశంలో పాల్గొన్నారు. 1919లో గాంధీజీ పిలుపు మేరకు మంచి ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నన్యాయవాదవృత్తిని వదులుకొని ఖిలాపత్-సహాయ నిరాకరణోద్యమంలో

చిరస్మరణీయులు