పుట:చిరస్మరణీయులు, మొదటి భాగం.pdf/188

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

185

84. ఖాన్‌ అబ్దుస్‌ సమద్‌ ఖాన్‌

(1885-1972)

మహాత్మాగాంధీ మార్గాన నడిచి ఆయన ప్రతిరూపాలుగా అంతర్జాతీయంగా ఖ్యాతి గాంచిన 'సరిహద్దు గాంధీ' ఖాన్‌ అబ్దుల్‌ గఫార్‌ ఖాన్‌ తోపాటుగా జాతీయస్థాయిలో 'బెలూచీ గాంధీ' గా ఖాన్‌ అబ్దుస్‌ సమద్‌ ఖాన్‌ ప్రఖ్యాతి చెందారు.

ప్రస్తుత పాకిస్తాన్‌లో భాగమైన బెలూచిస్థాన్‌లోని గులిస్తాన్‌ గ్రామంలో 1885లో ఆయన జన్మించారు. చిన్నతనం నుండి స్వతంత్ర-సంస్కరణ భావాలుగల ఆయన పరాయి పాలకుల పెత్తనాన్ని, ప్రజలలో ప్రబలిన అనాచారాల్ని సహించలేక పోయారు. జాతి జనులలో చైతన్యంకోసం, సమాజంలో సంస్కరణలను తెచ్చేందుకు 'అంజుమాన్‌- యే- వతన్‌' (మాతృభూమి కోసం సంఘం) అను సంస్థను స్థాపించారు.

ఆ సమయంలో ఉదృతంగా సాగుతున్నజాతీయోద్యమంలో బలూచి ప్రజలను భాగస్వాములను చేయాలని అబ్దుస్‌ సమద్‌ ఖాన్‌ భావించారు. ఆ క్రమంలోబ్రిటిషర్ల దాస్యం నుండి స్వదేశాన్నిసంపూర్ణంగా విముక్తం చేయటంతో పాటుగా స్వజాతి ఉద్దరణ సాధించాలని అబ్దుస్‌ సమద్‌ తలంచారు. ఆ ఆలోచనలకు అనుగుణంగా తమ అంజుమన్‌ - యే-వతన్‌ ను భారత జాతీయ కాంగ్రెస్‌కు అనుబంధసంస్థగా చేశారు.

1920 నుండి భారత జాతీయ కాంగ్రెస్‌తో కలసి పనిచేస్తూ మహాత్ముని అహింసా

చిరస్మరణీయులు