పుట:చిరస్మరణీయులు, మొదటి భాగం.pdf/178

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

175

79. సైఫుద్దీన్‌ కిచ్లూ

(1888-1963)

సమరోజ్వల భారత స్వాతంత్య్రోద్యమ చరిత్రలో రక్తాక్షరాలతో లిఖించబడిన జలియన్‌ వాలా బాగ్ సంఘటనకు నేపద్య నాయకులలో ప్రదములు, బ్రిటిష్‌ ప్రబుత్వ కారాగారాల్లో 14 ఏండ్ల పాటు శిక్షను అనుభవించిన యోధులు డాక్టర్‌ సైఫుద్దీన్‌ కిచ్లూ.

1888 జనవరి 15న పంజాబ్‌ రాష్ట్రం ఫరీద్‌కోట్ లో సైపుద్దీన్‌ కిచ్లూ జన్మించారు. తండ్రి అజీజుద్దీన్‌. తల్లి జాన్‌ బీబి. సంపన్న కుటుంబంలో పుట్టిన ఆయన అమృతసర్‌, ఆగ్రా, అలీఘర్‌లలో విద్యాభ్యాసం తరువాత లండన్‌ వెళ్ళి న్యాయశాస్త్రం, ఆ తరువాత జర్మనీ వెళ్ళి తత్వశాస్త్రంలో డాక్టరేట్ చేసి 1913లో అమృతసర్‌ వచ్చారు. అమృతసర్‌లో న్యాయవాదిగా స్థిరపడి మంచి ఆర్జనాపరుడిగా ఖ్యాతిగాంచిన ఆయన 1915లో జాతీయోద్యమకారిణి సాదత్‌ బాను వివాహమాడారు.

మంచి వకగా పేర్గాంచిన డాక్టర్‌ కిచ్లూ 1915లో హోంరూల్‌ ఉద్యమంలో పాల్గొనటం ద్వారా రాజకీయరంగ ప్రవశం చేశారు.1919లో బ్రిటిష్‌ ప్రబుత్వం రౌలత్‌ చట్టం తీసుకు రాగా, జలియన్‌వాలా బాగ్ లో 1919 మార్చి 30న జరిగిన భారీ బహిరంగ సభలో ఆ చట్టానికి వ్యతిరేకంగా డాక్టర్‌ సైఫుద్దీన్‌ వలస పాలకుల మీద నిప్పులు కక్కుతూ ప్రసంగించారు. ఆ తరువాత ఏప్రిల్‌ 9న డాక్టర్‌ సత్య పాల్‌ డాంగ్ నాయకత్వంలో జరిగిన

చిరస్మరణీయులు