పుట:చిరస్మరణీయులు, మొదటి భాగం.pdf/179

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

176

శ్రీరామ నవమి ఊరేగింపులో మతాల ప్రసక్తి లేకుండా అంతా పాల్గొని భారతీయుల ఐక్యతను చాటాలని పిలుపునిస్తూ వేలాది ముస్లింలతో డాక్టర్‌ సైఫుద్దిన్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలలో పెల్లుబికిన చైతన్యం, వ్యక్తమైన ఐక్యత పాలకుల వెన్నులో చలి పుట్టించింది. ఆ భయం వల్లే డాక్టర్‌ కిచ్లూ, డాక్టర్‌ డాంగ్ లను ప్రభుత్వం చర్చలకని పిలిచి నిర్బంధించి ప్రవాసానికి పంపింది. ఈ సంఘటనతో డాక్టర్‌ కిచ్లూ Hero of Jalianwala Bagh గా భారత స్వాతంత్య్రోద్యమ చరిత్రలో ప్రఖ్యాతులయ్యారు.

1919 చివరిలో నిర్బంధాం నుండి బయటకు వచ్చిన ఆయన లక∆లను ఆర్జించి పెడుతునfl న్యాయవాదా వృత్తిని మానేసి జాతీయ కాంగ్రెస్‌కు అంకితమయ్యారు. ఖిలాఫత- సహాయ నిరాకరణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న కిచ్లూ అఖిల భారత ఖిలాఫత్‌ కమిటీకి అధ్యక్షులయ్యారు. ఖిలాఫత్‌ నేతగా హిందూ,ముస్లింల ఐక్యతను వాంఛిస్తూ, ముస్లింలను జాతీయ కాంగ్రెస్‌లో చేరమని పిలుపునిచ్చారు. ముస్లింల హక్కుల పరిరక్షణకు గాను, Taharik-I-Tanzim సంస్థను ప్రారంభించారు. ఆ సంస్థ కార్యక్రమాలను ప్రచారం చేసేందాుకు Tanzim అను ఉర్దూ పత్రిక నడిపారు. భారత దేశపు ప్రధాన జనశ్రేణులైన హిందూ-ముస్లింలలో ఐక్యతకోసం అహర్నిశలు శ్రమించిన డాక్టర్‌ కిచ్లూ వలస పాలకులకు వ్యతిరేకంగా మతప్రసక్తి లేకుండా ఉమ్మడిగా ఉద్యమించాలని కోరారు.

1924లో జాతీయ కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శిగా, 1929లో లాహోర్‌ జాతీయ కాంగ్రెస్‌ సమావేశాల ఆహ్వానసంఘం అధ్యక్షనిగా వ్యవహరించారు. డాక్టర్‌ కిచ్లూకు గాంధీజీ అంటే వ్యక్తిగతంగా గౌరవం ఉన్నా రాజకీయంగా ఆయన సుభాష్‌ చంద్రబోస్‌ను అనుసరించారు. ఆ క్రమంలో కిచ్లూ కాంగ్రెస్‌కు దూరమయ్యారు. ఆయన అది నుండి ముస్లింలీగ్ వేర్పాటువాద రాజకీయాలను వ్యతిరేకించారు.

1947లో భారత దేశానికి స్వాతంత్య్రం లభించాక, డాక్టర్‌ సైపుద్దీన్‌ కమ్యూనిజం పట్ల ఆకర్షితులయ్యారు. కమ్యూనిస్టు పార్టీలో పనిచేయడం కాకుండా శాంతి-స్నేహం లాంటి సంస్థలలో ప్రపంచశాంతి కోసం కృషిచేశారు. ఈ సందర్భంగా ప్రపంచంలోని ప్రముఖ నేతలను కలిసి ప్రపంచ శాంతికి పిలుపునిచ్చారు. డాక్టర్‌ కిచ్లూ శాంతి కోసం నిరంతరం సాగించిన కృషికి గుర్తింపుగా 1954లో ఆయనకు స్టాలిన్‌ శాంతి పురస్కారం లభించింది. సమరశీల యోధులైన ఆయన అవిశ్రాంతగా విశ్వశాంతి, ప్రపంచ ప్రజలలో శాంతి-స్నేహం ఆకాంక్షిస్తూ ముందుకు సాగారు. చివరి వరకు సామ్యవాద వ్యవస్థను కలలు గంటూ ప్రపంచశాంతి కోసం కృషిచేస్తూ వచ్చిన ప్రపంచశాంతి ప్రవక్త, డాక్టర్‌ సైఫుద్దీన్‌ కిచ్లూ 1963 అక్టోబర్‌ 9న తుది శ్వాసవిడిచారు.

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌