పుట:చిరస్మరణీయులు, మొదటి భాగం.pdf/177

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

174

చేసిన ప్రసంగంతో మండిపడిన ప్రభురత్వం ఆయనకు మళ్ళీ జైలుశిక్షను ప్రసాదించింది. అప్పటి నుండి జైలుశిక్షలు ఆయన జీవితంలో భాగమయ్యాయి. జాతీయోద్యమ కార్యక్రమాలలో తనదైన భాగస్వామ్యాన్ని అందిస్తూ వివిధ ప్రాంతాలను తిరుగుతూ 1938లో ఆయన హైదారాబాద్‌ వచ్చారు. ఆయన రాక బ్రిటిష్‌ పాలకులకు, నిజాంకు రుచించకపోవడంతో భాగ్యనగరం నుండి బహిష్కరణకు గురయ్యారు.

ఆయన మతాభిమాని అయినప్పికీ, మతతత్వ రాజకీయాలు నచ్చక మొదటి నుంచి అఖిల భారత ముస్లింలీగ్ కు దూరంగా ఉన్నారు. మతాభిమానం ఉన్నా, మత దురభిమానం మాత్రం కూడదన్నది ఆయన అభిమతం. హైదారాబాద్‌ నుండి కేరళ రాష్ట్రంలోని మలబార్‌ చేరుకున్న ఆయన ముస్లిం లీగ్ మతతత్వ రాజకీయాలను నిరశిస్తూ ప్రసంగాలు చేసి లీగ్ నేతల ఆగ్రహానికి గురయ్యారు. భౌతిక ప్రమాదం ఏర్పడటంతో 1945లో మగ్బూల్‌ అహ్మద్‌ మలబార్‌ వదిలి పెట్టాల్సి వచ్చింది. మలబార్‌ నుండి మధ్యప్రదేశ్‌ చేరిన ఆయన అక్కడి జాతీయ రాజకీయాలలో తనదైన పాత్రను పున: ప్రారంభించి 1946లో సియోని కాంగ్రెస్‌ కమిటీకి అద్యక్షులయ్యారు. మౌలానా అబుల్‌ కలాం అజాద్‌ అధ్యక్షతన గల Nationalist Muslim Conference నాయకునిగా మత సామరస్యం ప్రబోధిస్తూ, వేర్పాటువాదాన్ని వ్యతిరేకిస్తూ దక్షిణ భారతదేశం అంతా ఆయన పలుమార్లు పర్యటనలు చేశారు.

భారత విభజన జరగడంతో తీవ్రంగా వ్యధచందిన మగ్బూల్‌ అహమ్మద్‌ ఆ తరు వాత నవభారత నిర్మాణానికి నడుంకట్టారు. నిజాం సంస్థానం భారతదేశంలో విలీనం కావాలంటూ సాగిన ఉద్యమంలో బహుముఖ పాత్రపోషించారు. ఈ సందర్బంగా జరిగిన పోలీస్‌ యాక్షన్‌లోని బాధితులను, నిరాశ్రయులను ఆదుకోడానికి శ్రమించారు.

1952-56 సంవత్సరంలో హెదారాబాద్‌ విధాన సభ సబ్యునిగా నియక్తులయ్యారు. అనంతరం 1956-60లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విధన సభలో కాంగ్రెస్‌ పార్టీ నేతగా, ప్రజాప్రతినిధిగా ప్రజల పక్షం వహించి నిర్మాణాత్మకంగా బాధ్యతలను నిర్వహించారు. జర్నలిస్టుగా రాణించాలన్న ప్రగాఢమైన కోరిక గల ఆయన పలు వ్యాసాలను, పలు పరిశోథనాత్మక గ్రంథాలను వెలువరించారు. నగరంలోని రచయితలను ప్రోత్సహించేందుకు గాను, తనదైన భావాలను వ్యక్తీకరించేందుకు, SALTANATH, PAISA AKHBAR, DAILY SALTANATH, PAISA AKHBAR,MUSHEER-E-DECCAN, AMAR BHARATH అను వార్తాపత్రికల సంపాదకవర్గాలలో సభ్యునిగా చేరి విశేషకృషి సల్పిన మగ్బూల్‌ అహ్మద్‌ 1963 జూలై 14న హైదారాబాద్‌ నగరంలో తన 61వ ఏట అంతిమశ్వాస విడిచారు.

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌