పుట:చిరస్మరణీయులు, మొదటి భాగం.pdf/176

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

173

78. మగ్బూల్ అహమ్మద్

(1902 - 1963)

1857లో హైదారాబాదు నగరం నడిబొడ్డున ఆంగ్ల -నిజాం సెన్యాల మీద దాడులు జరిపి భాగ్యనగరం నడిబొడ్డున ఉరికొయ్యకు ఉయ్యాలలూగిన పఠాన్‌ తుర్రేబాజ్‌ ఖాన్‌, అండమాన్‌ దీవులో ప్రాణాలర్పించిన మౌల్వీ అల్లావుద్దీన్‌ల వారసుడిగా అటు నిజాం ఇటు ఆంగ్లేయుల పెత్తనాన్నిసవాల్‌ చేసిన యోధుడు మగ్బూల్‌ అహమ్మద్‌.

1902 మే 28న జన్మించిన ఆయన హెదారాబాద్‌ నివాసి. చిన్ననాటి నుండే జాతీయ భావాల పట్ల మొగ్గు చూపిన అహ్మద్‌ ఆలీఘర్‌ Mohammedan Anglo Oriental College లో బి.ఎ. చదువుతూ, గాంధీజీ పిలుపు మేరకు కళాశాల విద్యకు స్వస్థిచెప్పి సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొన్నారు.అప్పటి నుండి జాతీయ కాంగ్రెస్‌ క్రియాశీలక కార్యకర్తగా జీవిత చరమాంకం పనిచేశారు. భారత జాతీయ కాంగ్రెస్‌ పిలుపుమేరకు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలు పర్యటిస్తూ ప్రచార కార్యక్రమాలను నిర్వహించారు.

1930లో ఉప్పు సత్యాగ్రహం సందర్భంగా మధ్యప్రదేశ్‌లోని సియోని అను ప్రాంతంలో ఉప్పును తయారు చేసినందుకు శిక్షను అనుభవించారు. అప్పటినుండి ఆరంభమైన శికహలకు ఏమాత్రం వెరవని ఆయన శాసనోల్లంఘనోద్యమంలో పాల్గొన్నారు. ఈ సందర్భాన్ని పురస్క రించుకుని బ్రిటిష్‌ పాలకులను తీవ్రంగా విమర్శిస్తూ సియాల్‌కౌట్లో

చిరస్మరణీయులు