పుట:చిరస్మరణీయులు, మొదటి భాగం.pdf/175

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

172

జాతీయోద్యమంలో భాగంగా కార్యకలాపాలను చురుకుగా నిర్వహిస్తున్న జమాత్‌లో ప్రదాన బాధ్యతలను స్వీకరించారు. 1929లో ఆ సంస్థ ఆధ్యర్యంలో జరిగిన సమ్మేళనంలో మూడు గంటల పాటు సుదీర్గ… ఉపన్యాసం చేస్తూ, ముస్లింలంతా జాతీయ కాంగ్రెస్‌లో చేరాలని, ప్రతి ఒక్కరూ జాతీయోద్యమంలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.

జమాత్‌లో లాగే జాతీయ కాంగ్రెస్‌లో కూడా పలు బాధ్యాతాయుతమైన పదవులను మౌలానా నిఎవహించారు.1936లో అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ సభ్యునిగా ఆయన ఎంపికయ్యారు. ఉత్తరప్రద్‌శ్‌ కాంగ్రెస్‌ కమిటీ ఉపాధ్యాక్షులుగా పనిచేశారు. ఏ సంస్ధలో ఉన్నా ఆ సంస్థ లక్ష్యాల సాధనకు ఆవిశ్రాంతంగా పని చేయటం, తన ప్రసంగాల ద్వారా ప్రజలను ఉద్యమాల దిశగా కార్యోన్ముఖులను చేయడం కర్తవ్యంగా ఆయన భావించారు. ఆ కారణంగా ప్రబుత్వ ఆగ్రహానికి గురైన మౌలానా హాఫజు ర్రెహమాన్‌ తన కుటుంబానికి దూరంగా సంవత్సరాల తరబడి జైలు జీవితం గడపాల్సి వచ్చింది.

మతం ప్రాతిపదికన దేశ విభజన జరగాలంటూ సాగుతున్నఆలోచనల వెనుక గల ప్రమాదాన్ని పసిగట్టిన ఆయన విభజన ఆలోచనను వ్యతిరేకించారు. ఈ సందర్బంగా ఆల్‌ ఇండియా ముసింలీగ్ నాయకుల వాదానలను ఆయన ఎదుర్కొన్నారు. లీగ్ చర్య లను తీవ్రంగా నిరశించారు. ముసింలీగ్ ప్రచారం వెనుక దుర్మారపు ఆలోచనలు దాగి ఉన్నాయని ప్రజలను హెచ్చరించారు. ఉద్వేగాలకు లోనై దారి తప్పవద్దని ముస్లింలను కోరారు. 1947 జూన్‌ 14న భారత జాతీయ కాంగ్రెస్‌ చేసిన విభజన తీర్మానాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ఈ సందర్భంగా మ్లాడుతూ, 'the Partition as the death warrant of nationalism...a communal mesure the like of which had never come before the AICC in the whole history' అన్నారు. భారత విభజన సృష్టించిన అల్లకల్లోలం సమయాన మతసామరస్యం కాపాడేందుకు, భాధితులను ఆదుకునేందుకు ప్రాణాలను సైతం పణంగా పెట్టి మౌలానా పనిచేశారు.

ఆయన మంచి వక్త మాత్రమే కాదు మంచి రచయిత కూడా. ఉర్దూలో అనేక ప్రసిద్ధ గ్రంథాలను ఆయన రచించారు. స్వతంత్య్ర భారతావనిలో ఆయన కాంగ్రెస్‌ పార్టీ సభ్యునిగా ప్రథమ లోక్‌సభ ఎన్నికలలో విజయం సాధించి ప్రజాప్రతినిధి అయ్యారు. ఆ తరువాత మొరాదాబాదు, అమ్రోహా పార్లమెంటరీ నియోజకవర్గాల నుండి విజయం సాధించిన ఆయన పార్లమెంటులో కూడా గొప్ప వక్తగా పేరుగడించారు. ఈ విధంగా పలు పాత్రలను సమర్థవంతంగా పోషించిన మౌలానా హఫీజుర్రెహమాన్‌్‌ 1962 ఆగస్టు 2న చివరిశ్వాస విడిచి చిరస్మరణీయులయ్యారు.

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌