పుట:చిరస్మరణీయులు, మొదటి భాగం.pdf/174

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

171

77. మౌల్వీ ముహ్మద్ హఫీజుర్రెహమాన్

(1901 - 1962)


స్వార్థపూరిత స్వప్రయోజనాల కోసం 'ప్రమాదంలో మతం' నినాదాంతో భారత దేశాన్ని రెండుగా చీల్చడానికి సాగిన ప్రయత్నాలను సాధికారికంగా ఎదుర్కొన్నమంచి వాగ్ధాటిగల నేతలలో మౌలానా హాఫీజు ర్రెహమాన్‌ అగ్రగామి.

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం బిజ్నోర్‌ జిల్లాలో 1901 జనవరి 10న ఆయన జన్మించారు. బ్రిటిష్‌ వ్యతిరేక శక్తుల తయారి కేంద్రాంగా ఖ్యాతిగాంచిన దేవబంద్‌లోని దారుల్‌-ఉలూం లో ఆయన విద్యాభ్యాం చేశారు. ప్రముఖ జాతీయోద్యమ నాయకులు మౌలానా ముహమ్మద్‌ హసన్‌ శిష్యరికంలో కరడుగట్టీన జాతీయోద్యమకారులు అయ్యారు.

1919 నుండి మౌలానా హఫజుర్రెహమాన్‌ ఆంగ్ల ప్రబు త్వం మీద సమర శంఖారావం పూరించారు. ఆ క్రమంలో JAMIAT-I-ULEMA-I-HINDలో సభ్యులు కావడంతోపాటుగా భారత జాతీయ కాంగ్రెస్‌ సభ్యతం స్వీకరించారు. 1921 లో ప్రారంభమైన ఖిలాఫత్‌ ఉద్యమంలో మౌలానా చురుకైన పాత్ర నిర్వహించారు. చిన్నతనం నుండి మంచి వక్తగా పేర్గాంచిన ఆయన ఉద్యమ లక్ష్యాలను, పరిణామాలను పూసగుచ్చినట్టు వివరించడమే కాకుండా ఉత్తేజపూరితంగా ప్రసంగిస్తూ ప్రజలను ఉద్యమ దిశగా నడిపంచి పలు ఖిలాఫత్‌ కమిటీలు ఏర్పాటు చేయించారు. ఖిలాఫత్‌-సహాయ నిరాకరణ ఉద్యమం సందర్భంగానే మహాత్మా గాంధీకి ఆయన సన్నిహితులయ్యారు.

చిరస్మరణీయులు