పుట:చిరస్మరణీయులు, మొదటి భాగం.pdf/166

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

163

73. ఖాన్‌ అబ్దుల్‌ జబ్బార్‌ ఖాన్‌

(1883-1958 )

సర్వస్వతంత్ర స్వేచ్ఛా ప్రియత్వానికి పెట్టింటిెంది పేరైన పఠాన్‌ ప్రజలను శాంతికాముకులుగా తీర్చిదిద్ది జాతీయోద్యమ దిశగా నడిపంచిన 'ఖాన్‌ సోదరుల'లో 'సరిహద్దు గాంధీ' గా ప్రఖ్యాతిగాంచిన ఖాన్‌ అబ్దుల్‌ గఫార్‌ ఖాన్‌ కాగా మరోకరు 'డాక్టర్‌ ఖాన్‌సాబ్‌' గా ఖ్యాతిగాంచిన మరోకరు ఖాన్‌ అబ్దుల్‌ జబ్బార్‌ ఖాన్‌.

ప్రస్తు త పాకిస్థాన్ లో భాగమై న పెషావర్‌ జిల్లా, చార్‌సద్దా తహసిల్‌లోని ఉత్తమంజాయ్‌ లోని సంపన్న కుటుంబంలో 1883 సంవత్సరం ఆయన పుట్టారు.పెషావర్‌లో ప్రాధమిక విద్య తరువాత బొంబాయి వెళ్ళి వైద్యవిద్యపూర్తిశారు. 1909లో ఉన్నతవిద్య నిమిత్తం ఇంగ్లాండ్‌ వెళ్ళి 1920లో స్వదేశం వచ్చి ఇండియన్‌ మెడికల్‌ సర్వీస్‌లో ప్రవేశించారు.

ఆ సమయంలో వాయవ్య సరిహద్దు ప్రాంతంలోని వజిరిస్తాన్‌లో పెల్లుబుకుతున్న పరాన్‌ తెగల తిరుగుబాటును అణిచివేయ డానికి వెళ్ళిన బ్రిటిష్‌ సైనికులకు వైద్య సేవలను అందించడానికి డాకర్‌ ఖాన్‌ను పంపగా, స్వజనులను ఇక్కట్ల పాల్జేస్తున్న బ్రిటిష్‌ సేనలకు వైద్యసేవలు అందజేయటం ఇష్టంలేక ఉద్యోగానికి ఆయన రాజీనామా చేశారు.

ఆ తరువాత ప్రజా సేవలో ప్రవేశించిన ఖాన్‌ అబ్దుల్‌ జబ్బార్‌ ఖాన్‌ కాస్తా 'డాక్టర్‌ ఖాన్‌ సాబ్‌' అయ్యారు. ఆ పేరుతోనే ఆయన జాతీయోద్యమ చరిత్రలో ప్రసిద్దులయ్యారు. సోదరుడు ఖాన్‌ అబ్దుల్‌ గఫార్‌ ఖాన్‌ మార్గంలో ప్రజల కోసం వైద్యశాలను ప్రారంభించి

చిరస్మరణీయులు