పుట:చిరస్మరణీయులు, మొదటి భాగం.pdf/165

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

162

ఉద్యమం' లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా భారతీయులు బ్రిటిష్‌ సైన్యం నుండి బయటకు రావాల్సిందిగా పిలుపిచ్చినందుకు రాజద్రోహం నేరం క్రింద మౌలానాను నిర్బంధించారు.

బ్రిటిష్‌ పాలనలో హిందువులు, ముస్లింలు ఒకే విధంగా బానిసత్వం భరిస్తున్నారు కనుక హిందూ-ముస్లింలు ఏకోన్ముఖంగా బ్రిటిష్‌ సామ్రాజ్యవాద శక్తులపై, పోరాటం సాగించాలన్నారు. ఈ లక్ష్యాన్ని సాధించాలంటే హిందూ-ముస్లింల మధ్యపటిష్టమైన స్నేహం, సామరస్య భావాలు పెంపొందడం దేశ ప్రయె జనాల దృష్ట్యా అత్యవసరమన్నారు.

జాతీయోద్యమంలో భాగంగా జరిగిన దండి సత్యాగ్రహంలో, శాసనోల్లంఘన ఉద్యమంలో మౌలానా మదాని చురుకైన పాత్రను నిర్వహించారు. 1942లో సాగిన క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నందుకు ఆయన జైలు పాలయ్యారు. ఈ మేరకు ఆయన పలుమార్లు జైలుజీవితాన్నిరుచిచూడాల్సి వచ్చింది.

ఆల్‌ ఇండియా ముస్లిం లీగ్ వేర్పాటువాద రాజకీయాలను తొలుత నుండి మౌలానా వ్యతిరేకించారు. మత దురహంకారం, మత విద్వేషం రచ్చకొట్టడం, ఉమ్మడి ప్రయాజనాలకు మంచిది కాదన్నారు. 'ద్విజాతి సిద్థాంతం' అతి ప్రమాదకరమని వాదిస్తూ ముస్లింలీగ్ నేతల చర్యలను తూర్పార పడుతూ, భారత విభజన ఆలోచనలను నిశితంగా విమర్శిస్తూ ప్రసంగాలు చేశారు. ఈ మేరకు ఆయన పలు పుస్తకాలను రాశారు.

భారత విభజన వలన సంభవించిన పరిణామాలతో మøలానా అహ్మద్‌ హసన్‌ మదాని కలత చెందారు. ఆ తరువాత ఆయన స్వతంత్ర భారత దేశంలో విద్య, ఆధ్యాత్మిక రంగాల మీద దృష్టి సారించారు. చిన్ననాట తాను చదువుకున్న విద్యాలయం DARUL-ULOOMఆ' ప్రదానాచార్యునిగా సుదీఋఘాకాలం పనిచేశారు. జాతీయోద్యమంలో తనఫాఈన ప్రధాన పాత్రను పోషించినJAMIT-UL-ULAMA నేతగా, మార్గదర్శకునిగా జీవితాంతం పని చేశారు.మౌ లానా మదాని అందించిన సేవలకు గుర్తింపుగా ఆయనకు SHAIK-UL-ULAMA అను బిరుదును అందించి JAMIT-UL-ULAMA తNNUతాను గౌరవించుకుంది.

స్వాతంత్య్రోద్యమంలోనూ, స్వతంత్ర భారతంలోనూ, మౌలానా అహ్మద్‌ హసన్‌ మదాని నిర్వహించిన నిర్మాణాత్మక పాత్రను గౌరవిస్తూ,భారత ప్రబుత్వం 'భారత భూషణ్' అవార్డునిచ్చి గౌరవించదలించింది. మాతృభూమి విముక్తి కోసం తాను ఏది చేసినా అది తన విధి మాత్రమేనని. విధ్యుక్త ధర్మాన్ని నిర్వహించినందుకు అవార్డులు-రివార్డులు స్వీకరించడం సరికాదు అన్నారు. చివరివరకు మాతృభూమి మీదఅత్యంత ప్రేమాభి మానాలు చూపిన మౌలానా మదాని 'భారతదశంలో మరణించాలనుకుంటున్నాను' అంటూ ఆయన ఆకాంక్షించినట్టుగానే 1957లో ఢిల్లీలో అంతిమశ్వాస విడిచారు.

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌