పుట:చిరస్మరణీయులు, మొదటి భాగం.pdf/167

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

164

వెద్య సేవల ద్వారా జాతీయోద్యమంలో ప్రవశించారు. 1930లో గాంధీజీ పిలుపు మేరకు ఆరంభమైన శాసనోల్లంఘ న ఉద్యమంలో పాల్గొన్నారు. అ సందర్బంగా తన తొలి రాజకీయ ప్రసంగం చేశారు. పెషావర్‌లోని ఖిస్సాఖాని బజార్‌లో ప్రజల మీద పోలీసులు జరిపిన కాల్పులలో తీవ్రంగా గాయపడిన వందలాది కార్యకర్తలకు సేవలందించి ప్రభుత్వ ఆగ్రహానికి గురయ్యారు. జైలుశిక్షను అనుభవించారు. శిక్షకాలం ముగిశాక డాక్టర్‌ ఖాన్‌ సాబ్‌ వాయవ్య సరిహద్దు రాష్ట్రం నుండి బహిష్కరణకు గురయ్యారు.

ఆ తరువాత నుండి జాతీయోద్యమానికి పూర్తికాలం వెచ్చించడం ద్వారా డాక్టర్‌ ఖాన్‌ సాబ్‌ భారత జాతీయ కాంగ్రెస్‌ నాయకునిగా ఎదిగారు. వాయవ్య సరిహద్దు ప్రాంతపు కాంగ్రెస్‌ పార్టీ విభాగానికి తిరుగులేని నేతగా ప్రజల మన్నన పొందారు. 1935లో, 1940లో జరిగిన ఎన్నికలలో ముసింలీగ్ అభ్యర్ధులను పూర్తిగా పరాజితుల్ని చేసి, ఆయన నాయకత్వంలో భారత జాతీయ కాంగ్రెస్‌ ఘన విజయం సాధించింది. ఆ ఘన విజయం డాక్టర్‌ ఖాన్‌సాబ్‌ కు ముఖ్యమంత్రి పదవి తెచ్చిపెట్టింది.

1942లో సాగిన 'క్విట్ఇండియా' ఉద్యమంలో ఆయన చురుగ్గా పాల్గొన్నారు. ఆరంభం నుండి వేర్పాటువాదభావనలను వ్యతిరేకిస్తూ, హిందూ-ముస్లింల ఐక్యతను అభిలషించిన ఆయన అఖిల భారత ముస్లింలీగ్ చేస్తున్న భారత విభజన వాదనను వ్యతిరేకించారు. మహమ్మద్‌ అలీ జిన్నా ద్విజాతి సిద్ధాంతాన్ని సమర్ధవంతంగా తిప్పికొట్టారు . 1946 ఆగస్టు 16న ముసింలీగ్ ప్రత్య క్షచర్య కు పిలుపునివ్వగా హిందూ-ముస్లింల మధ్య సామరస్య వాతావరణం చెడకుండాకాపాడేందుకు స్వయంగా కష్టపడ్డారు.

భారత జాతీయ కాంగ్రెస్‌ 1947 మే 1న విభజనకు సూత్రప్రాయంగా అంగీకరించగా డాక్టర్‌ ఖాన్‌ సోదరులు వ్యతిరేకించారు. పాకిస్థాన్‌ ఏర్పడ్డాక భారత విభజన వ్యతిరేకించిన పాపానికి ముస్లింలీగ్నాయకత్వంలో ఏర్పడిన పాకిస్థాన్‌ ప్రభుత్వం డాక్టర్‌ ఖాన్‌ను 'విద్రోహి'గా పరిగణించింది. ఆయన ప్రభుత్వాన్ని రద్దుచేసి ఆయనను ఆరేండ్లు గృహ నిర్బంధానికి గురి చేసింది.ఆ తరువాత నుండి చాలాకాలం ఖాన్‌ సోదరులకు పాకిస్థాన్‌ జైలులా మారింది. ఆ సోదరులిరువురు పలుమార్లు బహిష్కరణకు కూడా గురయ్యారు.

ప్రభుర్వాలు ఎలా పరిగణించినా ప్రజలు మాత్రం ఆయనను తమ ప్రియతమ నేతగా గౌరవించారు కనుక ఎన్నికల ద్వారా అధికారం చేపట్టినా ఆయన వ్యతిరేక శక్తులు ఆయనను ఏ పదవిలోనూ పూర్తిగా కొనసాగనివ్వలేదు. ఆయన అడ్డు తొలిగిం చేందుకు కుట్రలు జరుగుతున్నాయని తెలిసినా ప్రజలతో మమేకమై తిరగడాన్ని మానక పోవడంతో 1958 మే 9న ఖాన్‌ అబ్దుల్‌ జబ్బార్‌ ఖాన్‌ హత్యకు గురయ్యారు.

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌