పుట:చిరస్మరణీయులు, మొదటి భాగం.pdf/164

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

161

72. మౌలానా అహ్మద్‌ హసన్‌ మదాని

(1879- 1957)

భారతీయుల స్వేచ్ఛా-స్వాతంత్య్రాల కోసం ఆంగ్లేగేయులతో మాత్రమే కాకుండా భారత విభజన ససేమిరా మంచిదికాదంటూ చివరిదాక వేర్పాటువాద శఖ్టూ లతో పోరాడిన ధార్మిక నేతలలో మౌలానా అహ్మద్‌ హసన్‌ మదాని ప్రముఖులు.

1879లో ఉట్టార ప్రదశ్‌ రాష్ట్రంలో జన్మించారు. ఆయన కుటుంబం ప్రదమ శ్వాఆతంత్య్ర సమరంలో పాల్గొణ్ణా కారణంగా ఆంగ్లేయపాలకుల వేధింపులు భరించలేక 1889లో మౌలానా తళ్ళీతండ్రులు మక్కా-మదీనాకు వెళ్ళారు. మౌలానా మదాని మదీనాలో ధార్మిక విద్యాభ్యాసం చేస్తూ పదాహారేండ్లు మక్కా-మదీనాలో గడిపిన ఆయన ఉత్తమ ధార్మిక పండితుడిగా ధార్మిక జ్ఞానాన్ని సంపాదించుకున్నారు.

జాతీయోద్యామకారులు మౌలానా ముహమ్మద్‌ హసన్‌తో ఆయనకు పరిచయం కలిగింది. మాతృభూమి విముక్తి కోసం మౌలానా హసన్‌ సాగిస్తున్నపోరాటానికి మౌలానా మదాని మద్దతు పలికారు. ఆ క్రమంలో స్వాతంత్య్రోద్యమ చరిత్రలో 'సిల్కు అక్షరాల కుట్ర కేసు' గా ప్రఖ్యాతి గాంచిన సంఘటనలో ఆయన పాల్గొన్నారు. ఆ కారణంగా బ్రిటిష్‌ ప్రబుత్వం 1916లో ఆయనను అరెస్టు చేసి మూడేండ్లు నిర్బంధించింది. 1920లో విడుదలయ్యాక భారతదేశం వచ్చిన మౌలానా మదాని 'ఖిలాఫత్‌-సహాయ నిరాకరణ

చిరస్మరణీయులు