పుట:చిరస్మరణీయులు, మొదటి భాగం.pdf/163

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

160

అందుకు ప్రభుత్వఉద్యోగి భతఖ్‌ మియా అన్సారిని ఎన్నుకున్నారు. ఆయనకు తమ విషాహార పథకాన్ని వివరించి విందులో గాంధీజీకి సూప్‌కు బదులుగా విషాన్ని అందించాలన్నారు. ఈ పదకాన్నివిజయవంతంగా అమలు చేసనట్టయితే స్వర్గ సుఖాలలో ముంచెత్తుతామని లేనట్టయితే భయంకర నరకాన్నిచూపిస్తామని ప్లాంటర్లు బతఖ్‌ మియాను హెచ్చరించారు. బలవంతులైన ఆంగ్లేయ ప్లాంటర్స్‌, ఆంఫగ్లేయాధికారుల సమక్షంలో ఏమీ అనలేక సరనన్న అన్సారి నేరు గా గాంధీజీని కలసి కుట్ర విషయాన్ని వెల్లడిచగా విషాహారం కుట్రకు బలికాకుండా మహాత్ముడు క్రమంగా బయటపడ్డారు . ఆ విషయాన్ని బతఖ్‌ మియా గాంధీజీకి వివరిస్తున్నప్పుడు ఆయన వద్ద డాక్టర్‌ బాబూ రాజేంద్రాప్రసాద్‌ ఉన్నారు.

1917 నాటి ఈ సంఘటనకు ప్రత్య కసాక్షి డాక్టర్‌ బాబూ రాజేంద్రాప్రసాద్‌ 1950లో స్వతంత్ర భారతదేశ రాష్ట్రపతి హోదాలో మోతిహారీ వచ్చారు. ఆ సందర్భంగా జనంలో దీన వదనంతో కన్పించిన బతఖ్‌ మియాను గుర్తుపట్టి ఆయన స్థితిగతులను తెలుసుకుని చలించిపోయారు. ఆయనకు 50 ఎకరాల భూమిని మంజూరు చేయాల్సిందిగా జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు జారీచేశారు. అధికారుల అలక్ష్యమ్, అతి జాప్యం వలన రాష్ట్రపతి ఆదేశాలు చాలాకాలం అమలు కాలేదు. బతఖ్‌ మియా కుటుంబం సంవత్సరాల తరబడి కాళ్లకు బలపాలుకట్టుకుని తిరిగినా రాష్ట్రపతి ప్రసాదించిన భూమి దక్కలేదు.

బతఖ్‌ మియా అన్సారి కుటుంబీకులతో రాష్ట్రపతి బాబూ రాజేంద్రా ప్రసాద్‌ ఉత్తర ప్రత్యుత్తరాలు సాగించారు. 1957 అన్సారి మృతి చెందారన్న విషాదావార్త తెలుసుకున్న డాక్టర్‌ రాజేంద్రా ప్రసాద్‌ అన్సారి కుటుంబీకులను 1958 డిసెంబరు 3న రాష్ట్రపతి భవన్‌కు పిలిపించి యోగ క్షేమాలు కనుక్కున్నారు. 1950లో భారీ బహిరంగ సభలో తాను స్వయంగా జారీ చేసన ఆజ్ఞలు ఇంకా అమలు కాని విషయం ఆయనకు తెలిసింది. ఆ మీదట తగిన చర్య లు తీసుకున్నాక కాని అన్సారి కుటుంబీకులకు భూమి లభ్యంకాలేదు .

జాతీయోద్యమ చరిత్రలో అత్యంత ప్రాముఖ్యతకు నోచుకోవాల్సిన బతఖ్‌ మీయా అన్సారి త్యాగం చాలా కాలం తరువాత స్వాతంత్య్ర సమర యోధులు సయ్యద్‌ ఇబ్రహీం ఫిక్రి ఉర్దూలో రాసిన 'హిందూస్ధానీ జంగ్-యే-ఆజాది మే ముసల్మానోంకాౌ హిస్సా' గ్రంథం ద్వారా వెల్లడయ్యింది. భారత ప్రబుత్వం ఆర్థిక సహాయంతో 1999లో ప్రచురితమైన ఈ ఉర్దూ గ్రంథం ఆ తరువాత ఇతర భారతీయ భాషలలో భారత ప్రభుత్వ ఆర్థిక సహాయంతో ప్రచురితమైంది. మహాత్మా గాంధీకి ఎటువంటిఅపకారం జరగకుండా చూసి జాతీయోద్యమానికి ఎంతో ఉపకారం చేసిన బతఖ్‌ మియా అన్సారి 1957లో తన 90వ ఏట చివరిశ్వాస విడిచారు.

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌