పుట:చిరస్మరణీయులు, మొదటి భాగం.pdf/159

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

156

సమసమాజ స్థాపన ధ్యేయంగా సోషలిస్టు ఉద్యమ నిర్మాణం వైపు మొగ్గు చూపుతున్న సమయంలో జమీందారి కుటుంబీకుడైన రఫీఅహమ్మద్‌ జమీందారీలను రద్దుచేయాలని ప్రకటించి సంచలనం సృష్టించారు. జాతీయ కాంగ్రెస్‌ రాజకీయ విధానాలలో మార్పును ఆశిస్తూ అసెంబ్లీ ప్రవేశాన్ని అంగీకరించి మోతీలాల్‌ నెహ్రూ˙ పక్షాన చేరిన ఆయన 1935 నాటి ఎన్నికలలో విజయం సాధించి మంత్రి పదవిని కూడా చేపట్టారు. ఆ సందర్భంగా ప్రజల హితం ఆకాంక్షిస్తూ పలు సంస్కరణలను ప్రతిపాదించారు.

1940 అక్టోబర్‌లో ప్రారంభమైన యుద్ధావ్యతిరేక సత్యాగ్రహ ఉద్యమాన్ని నిర్వహించేందుకు జాతీయ కాంగ్రెస్‌ రాష్ట్ర శాఖ రఫీకి బాద్యత అప్పగించింది. ఆ సందర్భంగా ఆయన అరెస్టయ్యి సంవత్సరాల తరబడి జైలులో మగ్గాల్సిన పరిస్థితిని ఎదుర్కొన్నారు.ఈమేరకు ఆయన మొత్తం మీద పదేడ్లకు పైగా జైలు జీవితం గడిపారు. క్విట్ ఇండియా ఉద్యమం తరువాత అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో జరుగునున్న ఎన్నికల కోసం ప్రముఖ కాంగ్రెస్‌ నాయకులంతా అరెస్టయ్యి ఉండటంతో ప్రభుత్వం సహకారంలో బలపడన మసింలీగ్ ను ఎదుర్కొనేందుకు రఫీ అహమ్మద్‌ చాలా కష్టపడాల్సి వచ్చింది. ముస్లిం లీగ్ వేర్పాటువాద రాజకీయాలను వమ్ముచేసేందుకు ఆయన 'ఖ్యామీ ఆవాజ్‌' పత్రికను ప్రారంభించారు. లౌకిక, ప్రజాస్వామ్య భావనలను స్పష్టం చేస్తూ ఆయన 'నేషనల్‌ హెరాల్డ్‌' లాంటి పత్రికలకు వ్యాసాలు రాశారు. భారత జాతి ఉమ్మడి సంస్కృతి, సభ్యతల పట్ల అపార గౌరవం గల జాతీయవాదిగా ఆ సభ్యతా-సంస్కారాల పరిరక్షణకు కృషి సాగించారు. భారత విభజన అంటే సుసంపన్నమైన ఉమ్మడి సభ్యతా సంస్కారాల విభజనగా ఆయన భావించారు.

1947లో స్వాతంత్య్రం సిద్దించిన తరువాత పండిట్ నెహ్రూ˙ మంత్రివర్గంలో ఆయన పలు పదవులు చేపట్టారు . అన్నిరంగాలలో ప్రదర్శించిన శక్తిసామర్థ్యాల ఫలితంగా పండిట్ నెహ్రూ˙ తరువాత ఎవరూ? అనే ప్రశ్నకు సమాధానమయ్యేంత స్థాయికి రఫీ ఎదిగారు. అటు ప్రభుత్వంలోనూ, ఇటు ప్రజా సంఘాలలోనూ పలు పాత్రలను సమర్థవంతంగా నిర్వహించిన కిద్వాయ్‌ చివరివరకు దేశసేవ-ప్రజాసేవలో గడిపారు.

1954 అక్టోబర్‌ 24న ఢిల్లీలో జరిగిన ఒక సభలో ప్రసంగిస్తూ, వేదిక మీదనే గుండెనొప్పితో ఆయన కుప్పకూలారు. మాతృభూమి సేవలో చివరి క్షణం వరకు తనను తాను అర్పించుకున్న రఫీ అహమ్మద్‌ కిద్వాయ్‌ అంత్యక్రియలు మౌలానా అబుల్‌ ఆజాద్‌ పర్యవేక్షణలో ప్రజావాహిని దుఖాశ్రువుల మధ్యముగిసాయి.

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌