పుట:చిరస్మరణీయులు, మొదటి భాగం.pdf/160

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

157

70. మౌలానా హబీబుర్రెహమాన్‌

( 1892-1956)

భారత దేశ విభజన జరగడానికి దోహదం చేసిన పలు కారణాలలో 'ISLAM IN DANGER' అను నినాదం ఒకఋఇ. ఈ నినాదం వెనుక గల స్వార్థబుద్ధిని బహిర్గతం చేస్తూ ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు నిర్విరామంగా కృషి జరిపిన వారిలో మౌలానా హబీబుర్రెహమాన్‌ లుధియాన ప్రముఖులు.

1892 జులై 3న మౌలానా హబీబుర్రెహమాన్‌ పంజాబ్‌ రాష్ట్రం లూధియానాలో జన్మించారు. ఆయన వంశీకులకు 1857 నాటి ప్రదమ స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొన్న చరిత్ర ఉంది. 1903లో లూధియానాకు చెందిన ప్రముఖ ఇస్లామిక్‌ తత్వవేత్త మౌలానా అబ్దుల్‌ అజీజ్‌ కుమార్తె బీబి షఫాతున్నీసాను ఆయన వివాహమాడారు. ఆమె కూడ భర్త, బిడ్డలతోపాటుగా జాతీయోద్యమంలో పాల్గొన్నారు.

భారత జాతీయ కాంగ్రెస్‌ సభ్యత్వం స్వీకరించిన మౌలానా రెహమాన్‌ 1919నాటి ఖిలాఫత్‌ ఉద్యమంలో పాల్గొనటం ద్వారా జాతీయోద్యమంలో ప్రవశించారు.ఈ సందర్బంగా 1921 డిసెంబరు 1న ఆయన చేసన ప్రసంగం ప్రబుత్వానికి వ్యతిరేకంగా తిరగబడమని ప్రజలను ప్రేరేపించేదిగా ఉందంటూ బ్రిటిష్‌ పోలీసులు వారెంటు జారీ చేశారు. 1922 డిసెంబరు 22న తొలిసారిగా అరెస్టయ్యారు. ఆరు మాసాల జైలు శిక్ష పడింది. అప్పటి నుండి ఆయన మొత్తం మీద పది సంవ్సరాలకు పైగా వివిధజైళ్ళలో శిక్షలు

చిరస్మరణీయులు