పుట:చిరస్మరణీయులు, మొదటి భాగం.pdf/158

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

155

69. రఫీ అహమ్మద్‌ కిద్వాయ్‌

( 1894-1954)

బానిస బంధనాలనుండి మాతృభూమిని విముక్తి చేయటం కోసం జరిగిన పోరాటంలో పాల్గొనటం అదృష్టమైతే, ఆ తరువాత స్వేచ్ఛా భారతంలో, భావితరాల భవిష్యత్తును బంగారు మయం చేయానికి అవిశ్రాంతంగా కృషి చేసి తనదైన ముద్రను సుస్థిరం చేసుకోవటం మరింత భాగ్యం. ఆ స్ధభాగ్యాన్ని అందుకున్న ప్రముఖులలో ఒకరు రఫీ అహమ్మద్‌ కిద్వాయ్‌.

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని బారాబంకీ జిల్లా మస్ధలి గ్రామంలో 1894 ఫిబ్రవరి 18న రఫీ అహమ్మద్‌ జన్మించారు. చిన్నతనంలోనే తల్లిని కోల్పోయిన ఆయన పదేండ్ల వయస్సులో, పినతండ్రి ఇనాయత్‌ అలీ వద్దకు చేరి ఆయన నుండి బ్రిటిష్‌ వ్యతిరేక భావాలను పుణికి పుచ్చుకున్నారు. విద్యాభ్యాసం కోసం అలీఘర్‌ విశ్వవిద్యాలయం వెళ్లిన ఆయన వ్యక్తం చేసినబ్రిటిష్‌ వ్యతిరేక భావాల మూలంగా 'ప్రమాదకర వ్యక్తి'గా ముద్రపడ్డారు. ఆ తరువాత గాంధీజీ పిలుపు మేరకు అలీఘర్‌ను వదలి జాతీయ కాంగ్రెస్‌

సబ్యత్వం స్వీకరించి ఖిలాఫత-సహాయనిరాకరణోద్యమంలో క్రియాశీలకపాత్ర వహించిన

ఆయన అనతి కాలంలోనే బారాబంకీ జిల్లా నాయకుడయ్యారు. అప్పటి నుండి ఇటు రాష్ట్ర స్థాయి అటు జాతీయ స్థాయి రాజకీయాలలో ప్రముఖ పాత్ర వహించారు.

చిరస్మరణీయులు