పుట:చిరస్మరణీయులు, మొదటి భాగం.pdf/145

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

142

కాకుండా ప్రతి ఒక్కరిని ఖద్దరు ధరించమని అభ్యర్థించారు. భార్య హజరాబీబి తోసహా జీవితాంతం ఖద్దరు ధరించారు. ఈ మేరకు ప్రచార కార్యక్రమాలను నిర్వహించారు. ఈ విషయమై ముస్లింలీగ్ చే ప్రభావితులైన స్థానిక ముస్లింలు ఆయనను వ్యతిరేకించడమే కాకుండా సాంఫిుక బహిష్కరణకు గురిచేశారు. అయినా ఖద్దరు ఇస్మాయిల్‌, ఆయన భార్య హాజరా బీబి ఏమాత్రం భయపడకుండా జాతీయోద్యమంలో భాగస్వాములయ్యారు.

గుంటూరు జిల్లాలో ముహమ్మద్‌ ఇస్మాయిల్‌ తొలి ఖాదీ షాపును 1926లో ప్రారంభించారు. ఖద్దరు దుకాణం ప్రారంభించడానికి ప్రేరణ ఏమిటన్న ప్రశ్న కు హాజరా బీబి సమాధానమిస్తూ, రాట్నం వడికితే స్వాతంత్య్ర వస్తుందన్నారు మహాత్మా గాంధీ. ఆయన మాట మాకు వేదవాక్కు...అందువల్లే ఖద్దరు వాడకాన్ని ప్రోత్సహించేందుకు ఖద్ధరు షాపు ను ప్రారంభించాం అన్నారు. ఆ రోజుల్లో తెనాలిలోని స్వాతంత్య్ర సమర యోదులకు ఇస్మాయిల్‌ ఖాదీ షాపు రహస్య కూడలి కేంద్రమయ్యింది. ఆ క్రమంలో ముహమ్మద్‌ ఇస్మాయిల్‌ కాస్తా ఖద్దర్‌ ఇస్మాయిల్‌ అయ్యారు.

జాతీయోద్యమంలో ముహమ్మద్‌ ఇస్మాయిల్‌ చురుకుగా పాల్గొన్నారు. శాసనోల్లంఘ న ఉద్యమంలో పాల్గొన్న ఇస్మాయిల్‌ను పోలీసులు అరెస్టు చేసి, 18 మాసాల కారాగారవాస శిక్షవిధించారు. ఆ శిక్షతో ఆరంభమైన ఆయన జైలు జీవితం మొత్తం మీద ఆరు సంవత్సరాల పాటు సాగింది. తెనాలి, గుంటూరు, రాజమండ్రి, బళ్ళారి, తిరుచినాపల్లి, రాయవెల్లూరు తదితర జైళ్ళల్లో ఆయన పలుసార్లు శిక్షను అనుభవించారు.

జాతీయ భావాలు కలిగిన ఇస్మాయిల్‌ తీరుతెన్నులు నచ్చని ముస్లిం లీగ్ విధానాలతో ప్రబావితులైన కొందరు కాంగ్రెస్‌ రాజకీయాలను మానుకొమ్మని ఆయనను హెచ్చరించారు. ఆ హెచ్చరికలను ఏమాత్రం ఖాతరు చేయలేదు. ఆయన తన యావత్తు కుటుంబాన్ని మతతత్వ రాజకీయాలకు అతీతంగా ముందుకు సాగనిచ్చారు. ఆ ధోరణి నచ్చని కొందరు ఆయనకు ప్రాణాపాయస్థితి కూడా కల్గించారు. ఆ చర్య లకు ఏమాత్రం లొంగని ఇస్మాయిల్‌ జీవిత చరమాంకం వరకు జాతీయ భావాలతో లౌకిక వ్యవస్థ పట్ల అచంచల విశ్వాసంతో నడుచుకున్నారు.

ముహమ్మద్‌ ఇస్మాయిల్‌ రాయవెల్లూరు జైలులో ఉండగా కామెర్ల వ్యాధి సోకింది. ఆ వ్యాధి బాగా ముదరటంతో ప్రభుయ్వం ఆయనను విడుదల చేసింది. ఆ వ్యాధి తీవ్రత నుండి ఖద్దరు ఇస్మాయిల్‌ మళ్ళీ కోలుకోలేదు. అనారోగ్యంతో బాధాపడుతూ స్వతంత్ర స్వాతంత్య్రం కోసం పోరాడిన జాతీయోద్యమకారులు ముహమ్మద్‌ ఇస్మాయిల్‌ చివరకు స్వతంత్ర భారతంలో 1948 నవంబరు 19న ఆఖరిశ్వాస వదిలారు.

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌