పుట:చిరస్మరణీయులు, మొదటి భాగం.pdf/146

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

143

63. షోయాబుల్లా ఖాన్‌

(1920-1948)

ప్రథమ స్వాతంత్య్రసంగ్రామంలో ఆంగ్లేయులకు వ్యతిరేకంగా అక్షరాయుధాలను ఎక్కుపెట్టి ప్రాణాలు కోల్పోయిన పాత్రికేయునిగా ముహమ్మద్‌ బాకర్‌ చరిత్ర సృష్టించగా, వేర్పాటువాద భావాలకు వ్యతిరేకంగా అక్షరాలనే ఆయుధాలుగా మలచుకుని పోరాటం సాగించి అమరత్వం పొందిన అరుదైన కలం యోధులు షోయాబుల్లా ఖాన్‌.

1920 అక్టోబరు 17న ఖమ్మం జిల్లాలో షోయాబుల్లా జన్మించారు. తండ్రి హబీబుల్లా ఖాన్‌ పోలీసు అధికారి. కుమారుడిలో మహత్ముని పోలికలున్నాయని బిడ్డకు షోయబుల్లా గాంధీ అని పిలుచుకున్నాడాయన. చిన్నతనం నుండే, మహాత్మాగాంధీ గురించి వింటూ ఆయన అహింసా సిద్దాంతాలకు షోయాబ్‌ ప్రభావితులయ్యారు. ఉస్మానియా నుండి గ్రాడ్యుయేషన్‌ చేసిన ఆయనకు నిజాం సంస్థానంలో మంచి హోదాగల ఉద్యోగం లభించే అవకాశం ఉన్నా ఉద్యోగం వలదంటూ జాతీయోద్యమానికి తన వంతు సేవలను అందించటానికి జర్నలిజంను ప్రధాన వృత్తిగా స్వీకరించారు.

జాతీయ భావాలను, ఆ దిశగా రాయబడిన వ్యాసాలను ప్రోత్సహిస్తున్న తేజ్‌ ఉర్దూ వారపత్రికలో షోయాబుల్లా పనిచేశారు. నిజాం నవాబు, ఆయన తాబేదారయిన రజాకారుల అమానుష కృత్యాలను ఘాటుగా విమర్శిస్తూ వ్యాసాలు రాశారు. ప్రభువుల చర్యలను విమర్శించే ఆయన వ్యాసాలు సహజంగానే పాలక వర్గాలకు రుచించలేదు. చివరకు ఆ

చిరస్మరణీయులు