పుట:చిరస్మరణీయులు, మొదటి భాగం.pdf/144

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

141

మహాత్ముని మారదర్శ కత్వంలో ఖద్దరు ధారణ, ఖద్దరు ప్రచారాన్ని, ఖద్దరు విక్రయాన్ని స్వచ్చందంగా స్వీకరించి ఖద్దరు తో తన పేరు పెనువేసు కుని చివరకు ఖద్దరు ఇస్మాయిల్‌గా ప్రసిద్ధిగాంచిన ప్రముఖులు ముహమ్మద్‌ ఇస్మాయిల్‌.

ఆంధ్ర ప్రదేశ్‌ గుంటూరు జిల్లా నకరికల్లు గ్రామంలో 1892లో ముహమ్మద్‌ ఇస్మాయిల్‌ జన్మించారు. తండ్రి మహమ్మద్‌ మస్తాన్‌ సాహెబ్‌ పోలీసు కానిస్టేబుల్‌. తల్లి కులుసుం బీబి. గాంధీజీ పట్ల ప్రత్యేక ఆసక్తిని ప్రదర్శిస్తూ వచ్చిన ఇస్మాయిల్‌ తిన్నగా జాతీయ ఉద్యమం పట్ల ఆకర్షితులయ్యారు. బట్టల వ్యాపారం చేస్తూ, తన చిన్ననాటి మిత్రులు వేల్పుల గంగయ్యతో కలసి జాతీయోద్యమంలో పాల్గొన్నారు. గాంధీజీ స్పూర్తితో ఖద్దరు ఉత్పత్తిని, వాడకాన్ని ప్రోత్సహించేందుకు నడుం కట్టారు. ఆ కృషిలో భాగంగానే తెనాలిలో ఖాదీ షాపును ఆరంభించి, వ్యాపార దృషితో కాకుండా ప్రత్యేక లక్ష్యమ్తో దాన్ని నడిపారు. రాట్నం, దారం తీయటానికి దూది, చిలపలు, తకలీలు తదితర సామగ్రిని తెచ్చి, ఆసక్తిగల వారికి అందాుబాటులో ఉంచారు. ఖద్దరు తయారీని, గ్రామీణ కుటీర పరిశ్రమలను ప్రోత్సహించేందుకు గ్రామాలు తిరిగారు. ఖద్దరు తయారికి అవసరమైన సామగ్రిని తెచ్చి ఆసక్తి గలవారికి అందించి సహకరించారు. ఆయన స్వయంగా ఖద్దరు ధరించడం

చిరస్మరణీయులు