పుట:చిరస్మరణీయులు, మొదటి భాగం.pdf/143

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

140

జాతీయవాదులైన కాంగ్రెస్‌ నాయకులంటేనే మండిపడు తున్న తరుణంలో కరళ ఖిలాఫత్‌ కమిటీ ప్రధాన కార్యదార్శిగా ఆయన బాధ్యతలను స్వీకరించారు. సాయుధపోరాటాల ద్వారా మోప్లా యోధులు సాధించేదేమీ లేదంటూ అహింస, లౌకిక, జాతీయవాద సిద్ధాంతాలకు కట్టుబడి వ్యవహరిస్తూ ప్రజలను అహిసొద్యమం పట్ల ప్రబావితుల్ని చేశారు.

బ్రిటిష్‌ ప్రభుత్వమ్, బ్రిటిష్‌ సైనికులు హింసాత్మక చర్యలను రెచ్చగొడుతూ, మత సామరస్యానికి, హిందూ-ముస్లింల ఐక్యతను విచ్చిన్నం చేసేందుకు తప్పుడు ప్రచారం సాగిస్తున్నారని ఆగ్రహించిన ఆయన ప్రభుత్వ చర్యలను దుయ్యబట్టారు. ఆ కారణంగా అబ్దుల్‌ రహీం తన జీవితకాలంలో పలుమార్లు జైలుశిక్షలను అనుభవించారు.

1922 జనవరి తరువాత నుండి మోప్లా జనసముదాయాలను జాతీయోద్యమం దిశగా నడిపించేందుకు భారత జాతీయ కాంగ్రెస్‌ నాయకునిగా బాధ్యతలను స్వీకరించి లక్ష్య సాధన కోసం నడుంకట్టారు. అహింసోద్యమ ప్రచారం కోసం ఆయన పలు పత్రికలను నడిపారు. ఆ పత్రికల ద్వారా ప్రజలలో నూతన చైతన్యానికి నాంది పలికారు.

1930లో కరళ ప్రాంతీయ కాంగ్రెస్‌ కమిటీ ఉప్పుసత్యాగ్రహం ప్రకటించగా ప్రబుత్వ ప్రభావానికి లోనైయున్న ప్రజలు ప్రభుత్వాధికారుల మద్దతుతో సమావేశాలను, సభలను భగ్నంచేశారు. ఆ సమయంలో కేరళలో అడుగుపెట్టేందుకు నాయకులు భయపడుతున్న సమయంలో అబ్దుల్‌ రహిమాన్‌ కేరళలో పర్య టించారు. ఆలోచనాత్మక, ఉత్తేజపూరిత ప్రసంగాలతో తమ సందేశాన్నిఆయన ప్రజలకు చేర్చగలిగారు. మలబార్‌ మోప్లాలలో జాతీయ భావాలను పెంపొందించడంతోపాటు వారి భాగస్వాయ్యంతో ఉప్పు సత్యాగ్రహంలో భాగంగా 1930 మే 12వ తేదిన కాలికట్ సముద్రతీరంలో ఉప్పును తయారు చేశారు.

ఆ తరువాత గాంధీ ప్రబోధంతో ఆయన సాంఫిుక సంస్కరణోద్యమం మీదదృష్టి సారించారు. దళితోద్ధరణకు, హిందూ-ముస్లింల ఐక్యతకు కృషిచేశారు. జాతీయ విద్యా విధానాన్నిదేశం మొత్తం మీద వ్యాపింపచేయాలని ఆయన అభిలషించారు. జ్ఞానార్జన ద్వారా మాత్రమేఅజ్ఞానం నుండి బయట పడతాడతామని ప్రజల్లో ప్రచారం గావించారు. ఆ లక్ష్యంతో పనిచేసే సంస్థలను, వ్యక్తులను ఆయన ఎంతగానో ప్రోత్సహించారు.

దయార్ద్ర హృదయుడైన ఆయన తన ఆస్తిపాస్తులను పూర్తిగా జాతీయోద్యమ కార్యక్రమాల కోసం, సహచరుల కోసం త్యాగం చేసి అతి సామాన్య కార్యకర్తగా జీవితం గడిపారు. ప్రజల స్వేచ్ఛా-స్వాతంత్య్రాలను ఆకాంక్షిస్తూ మలబారు సాయుధ పోరాట యోధులను మహాత్ముని బాటలో అహింసోద్యమకారులుగా మార్చడానికి కారణమైన అహింసోద్యమ నేత అబ్దుల్‌ రహిమాన్‌ 1945 నవంబర్‌ 22న కన్నుమూశారు.

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌