పుట:చిరస్మరణీయులు, మొదటి భాగం.pdf/134

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

131

57. జులేఖా బేగం

(1893- 1943)

జాతీయోద్యమంలో భర్తతో పాటు భుజం భుజం కలిపి సాగిన మహిళలు కొందరైతే, ఉద్యమకారుడైన భర్త దృష్టి కుటుంబ సమస్యల వైపుకు మళ్ళనివ్వకుండా ఉద్యమ కార్యకలాపాలలో నిమగ్నమయ్యేందుకు తగిన నైతిక బలాన్ని ప్రసాదించిన మహిళలు మరికొందరు ఉన్నారు. ఆ రెండవ కోవకు చెందిన మహిళలలో జులేఖా బేగం ఒకరు.

బేగం జులేఖా 1892-93 ప్రాంతంలో పశ్చిమ బెంగాల్‌లో జన్మించారు. చిన్న వయస్సులో అనగా 1900-01 ప్రాంతంలో ఆమెకు మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌తో వివాహం జరిగింది. జులేఖా బేగం వైవాహిక జీవితాన్ని ఆరంభించేందుకు మెట్టినింట అడుగు పెట్టేసరికి మౌలానా ఆజాద్‌ బ్రిటిషు వ్యతిరేక పోరాటంలో నిమగ్నమైఉన్నారు.

బ్రిటిషు వ్యతిరేక పోరాటాన్ని విప్లవోద్యమంతో ప్రారంభించిన ఆయన ఆ తరువాత మహాత్ముని మార్గంలో ముందుకు సాగారు. ఒకవైపు విప్లవకారునిగా, ఆ తరువాత అహింసా యోధునిగా, మరొకవైపు ప్రఖ్యాత ఉర్దూ పత్రిక అల్‌ హిలాల్‌ సంపాదకునిగా, బహు గ్రంథ రచయితగా క్షణం తీరుబడి లేకుండా కార్యక్రమాలలో నిమగ్నం కాగా జులేఖా బేగం అన్ని విధాల, అన్ని కార్యక్రమాలలో మౌలానాకు జవం జీవమయ్యారు.

మౌలానా ఆజాద్‌ 1916లో మొట్టదటి సారిగా నిర్బంధానికి గురయ్యారు. అప్పటి

చిరస్మరణీయులు