పుట:చిరస్మరణీయులు, మొదటి భాగం.pdf/133

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

130

గౌరవాన్ని గమనించిన గాంధీజీ 1930 ఏప్రిల్‌ 11న ఆమె కుమార్తె రెహనా తయ్యాబ్జీ పేరిట ఓ లేఖ రాస్తూ 'మధ్య పాన నిషేధ, విదేశీ వసువుల బహిష్కరణ తదితర అంశాల మీద గుజరాత్‌ మహిళల సమావేశం ఏర్పాటు చేస్తున్నాను. ఆ సమావేశానికి నీవు, మీ అమ్మగారు తప్పక హాజరుకావాలి' అని కోరారు. స్వయంగా మహాత్ముడు పంపిన ఆహ్వానాన్ని గౌరవిస్తూ అమీనా ఆ సమావేశానికి హజరయ్యారు. ఆ సమావేశం మద్యపాన నిషేధం, విదేశీ వస్తువుల బహిష్కరణ కోసం కృషి చేయాలని నిర్ణయిస్తూ తీర్మానించింది. ఆ సమావేశంలో గాంధీజీ సమక్షంలో గుజరాత్‌ మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా అమీనా తయ్యాబ్జీ ఎంపికయ్యారు.

ఆ నిర్ణయాల మేరకు గుజరాత్‌ మహిళా కాంగ్రెస్‌ నేతగా అమీనా తయ్యాబ్జీ అన్ని కష్టనష్టాల కోర్చి మద్యపాన నిషేధం, విదేశీ వస్తువుల బహిష్కరణోద్యమానికి ప్రాణం పోశారు. గుజరాత్‌ అంతా ధర్నా, పికిటింగ్ , రాస్తారోకో లాంటి ఆందోళనా రూపాలతో ఉద్యమించి భారతదేశం మొత్తానికి గుజరాత్‌ను ఆదర్శప్రాయమైన మార్గంలో నిలిపారు. విదేశీ వస్తువుల బహిష్కరణకు ప్రత్యామ్నాయంగా ఖద్దరు వస్రదారణను ప్రోత్సహించారు. రాట్నం తిప్పటం, నూలు వడకటం, ఖద్దరు నేయటం, ఖద్దరు ధరించడం స్వయంగా ఆచరించి ఆయా కార్యక్రమాలకు అమీనా బహుళ ప్రాచుర్యం కల్పించారు.

ఆమె కృషి, కార్యదక్షతను గమనించిన గాంధీజీ తన యంగ్ ఇండియా, నవజీవన్‌ పత్రికలలో 'గుజరాత్‌ మహిళలు మహత్తరమైన బాధ్యతను స్వీకరించారు. ఆ బరువును మహిళల పక్షాన అమీనా తయ్యాబ్జీ ఆమె కమిటీ భరించారు' అని ప్రశంసించారు. ఈ ఉద్యమం నేపధ్యంలో మహిళా కాంగ్రెస్‌ పక్షాన వైశ్రాయికి 24 మంది మహిళల సంతకాలతో పంపిన లేఖలో అమీనా తయ్యాబ్జీ సంతకాన్ని గాంధీజీ ప్రత్యే కంగా కోరడం ద్వారా జాతీయ స్థాయిలో ఆమె ప్రాధాన్యత వెల్లడయ్యింది. ఆ లేఖలో ఆమనా ఖురేషి, రెహనా తయ్యాబ్జీలు కూడా సంతకాలు చేశారు.

చివరి వరకు ఆమె తన భర్త అబ్బాస్‌ తయ్యాబ్జీతోపాటుగా జాతీయోద్యమంలో పాల్గొన్నారు. ఉద్యమాలను దేశవ్యాప్తం చేయాలనుకునప్పడల్లా ఆ ఉద్యమ కార్యకలాపాలను మహాత్ముడు తొలుత గుజరాత్‌లో నిర్వహించేవారు. ఆ సమయంలో అమీనా లాంటి మహిళా నేతలు ఆ ఉద్యమ కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించి మహాత్మునికి భరోసా ఇవ్వగలిగారు. ఈ మేరకు జీవిత చరమాంకం వరకు జాతీయోద్యమకారులకు ఆదర్శంగా నిలచిన అమీనా తయ్యాబ్జీ 1942లో కన్నుమూశారు.

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌