పుట:చిరస్మరణీయులు, మొదటి భాగం.pdf/127

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

124

1913లో 'కాబా సేవకుల సంఘం' ఏర్పాటు చేసి కాబా కట్టడాన్ని పరిరక్షించేందుకు, హజ్‌ యాత్రికులకు తగిన సౌకర్యాలు కల్పించటం కోసం ఎనలేని కృషిచేశారు. పరాయి పాలనలో మగ్గుతున్నప్రజల స్థితిగతులను గమనించిన ఆయన బ్రిటిష్‌ ప్రభుత్వం మీద పోరాటానికి తన సోదరు లు మౌలానా మహమ్మద్‌ అలీతో కలసి ఉద్యమించారు. మౌలానా ముహమ్మద్‌ అలీ సంపాదకత్వంలో నడుస్తున్నఆంగ్ల వారప తిక 'కామ్రెడ్‌', ఉర్దూ దినపత్రిక 'హందర్ద్‌' నిర్వహణ బాధ్యతలను మౌలానా షౌకత్‌ అలీ చేపట్టారు.

ప్రథమ ప్రపంచ యుద్ధం సందర్భంగా అక్షరాయుధాంతో ఆంగ్లపాలకుల మీద విరుచుకుపడనందున అలీసోదరులు 1915 మే15న అరెస్టయ్యారు. వారి ఆస్థిపాస్థులను జప్తుచేసి, వివిధ ప్రాంతాలలో వారిని నిర్బంధించి 1919 డిసెంబరులో విడుదల చేశారు. ఆ విధంగా విడుదలకాగానే ఆయన ఖిలాఫత్‌-సహాయనిరాకరణ ఉద్యమంలో భాగస్వాములు అయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు మహాత్మాగాంధీèతో పరిచయం ఏర్పడింది. ఆ తరువాత మహాత్మునితో కలసి దేశపర్యటన గావించిన ఆయన అనర్గళ ప్రసంగాలతో, కార్యదీక్షతో ఖిలాఫత్‌-సహాయనిరాకరణ ఉద్యమానికి జవం-జీవం అయ్యారు. ఆ కారణంగా 1921లో ఆయన మళ్ళీ అరెస్టయ్యారు.

నిక్కచ్చి మనిషిగా ప్రసద్దులైన షౌకత్‌ అలీ పండిట్ మోతిలాల్‌ నెహ్రూ˙ రూపొందించిన 'నెహ్రూ˙ కమిటి నివేదిక' తో ఏకీభవించలేదు. తనకు నచ్చని విషయంలో ఏమాత్రం రాజీపడని ఆయన 1928లో జాతీయ కాంగ్రెస్‌కు దూరమయ్యారు. ఆ తరువాత మహాత్మాగాంధీతో కూడా సంబంధాలు సన్నగిల్లాయి. ఈ బేధాభిప్రాయాల వలన లాభించాలని ప్రయత్నించిన వ్యక్తుల కుయుక్తులను సాగనివ్వకుండా మౌలానా జాగ్రత్త పడ్డారు. 1929లో ఢిల్లీలో జరిగిన అన్నిపార్టీల సమావేశంలో క్రియాశీలక పాత్రను పోషించిన ఆయన 1932లో జెరుసలంలో ప్రపంచ ముస్లింల మహాసబను నిర్వహించారు.

భారత జాతీయ కాంగ్రెస్‌ నాయకులతో సరిపడక కాంగ్రెస్‌ నుండి పూర్తిగా బయటకు వచ్చిన ఆయన ముస్లిం లీగ్ వైపు మొగ్గుచూపారు. 'ఖిలాఫత్‌-యే-ఉస్మానియా' అను పత్రిక ద్యారా ముస్లిం జన సముదాయాల సంక్షేమం కోసం కృషిచేస్తూ పలు కార్యక్రమాలను రూపొందించారు. 1936లో సెంట్రల్‌ అసెంబ్లీ సభ్యులుగా భాద్యతలు చేపట్టారు . ఆయన ఎక్కడున్నా, ఏ పదవిలోనున్నా ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో ఏమాత్రం రాజీపడకుండా వ్యవహరించారు. నిర్మోహమాటి గా పేర్గాంచిన మౌలానా షౌకత్‌ అలీ తనదైన శైలిలో పయనిస్తూ 1938 నవంబరు 26న తనువు చాలించారు.

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌