పుట:చిరస్మరణీయులు, మొదటి భాగం.pdf/126

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

123

53. మౌలానా షౌకత్‌ అలీ

(1873- 1938)

జాతీయోద్యామంలో అత్యంత ప్రధాన ఘట్టమైన ఖిలాఫత్‌-సహాయ నిరాకరణోద్యమంలో ప్రధానపాత్ర నిర్వహించి 'అలీ సోదరులు' గా ప్రసిద్ధిచెందిన అన్నదమ్ములలో అగ్రజులు మౌలానాషౌకత్‌ అలీ.

1873 మార్చి 10 ఉత్తరప్రదేశ్‌లోని బిజినోర్‌ జిల్లా నాజిబాబాద్‌లో జన్మించారు. తల్లి ఆబాదిబానో బేగం. తండ్రి అబ్దుల్‌ అలీ ఖాన్‌. 1880 తండ్రిని కోల్పోయిన ఆయన జాతీయోద్యమంలో పాల్గొని ఆంగ్లేయ ప్రభుబుత్వం తో పోరాడి ఉద్యమకారులందరి చేత 'అమ్మా' అన్పించుకున్న తల్లి ప్రత్యేక సంరక్ల్షణలో పెరిగారు. ఆనాటి సమాజం కట్టుబాట్లను త్రోసిరాజంటూ ఆమె బిడ్డలకు ఉత్తమ ఆధునిక విద్యను అందించారు. 1888లోషౌకత్‌ అలీ తన సోదరు లు చదు వుకుంటున్నఅలీఘర్‌కు విద్యార్జన కోసం వెళ్ళి ఉత్తమ విద్యార్థిగా మాత్రమే కాకుండా ఉత్తమ క్రీడకారునిగా రూపొందారు.

చిన్నప్పటినుండే నాయకత్వ లక∆ణాలను ప్రదర్శించిన ఆయన కళాశాల విద్యార్థి సంఘం నాయకులు కావటమే కాకుండా కళాశాల మ్యాగ్ జైన్‌ సంపాదకులుగా బాధ్యతలు నిర్వహించారు. 1895లో బి.ఎ ఉత్తీర్ణత పొందిన ఆయన 1896 నుండి 17 ఏండ్లపాటు ప్రభుత్వ ఉద్యోగం చేశాక అలీఘర్‌ విద్యాలయం అభివృద్థికి నిధులను రాబట్టేందుకు ఆగాఖాన్‌తో కలసి పర్యటనలు గావించేందుకు ఉద్యోగానికి రాజీనామా చేశారు.

చిరస్మరణీయులు