పుట:చిరస్మరణీయులు, మొదటి భాగం.pdf/125

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

122

బొంబాయి వెళ్ళి స్వరాజ్యనిధి కోసం అందచేశారు. నిజాం నవాబు ఎన్ని ఆంక్షలను విధించినా, ఎన్ని కట్టుదిట్టాలు చేసినా అహింసా సిద్ధాంతాలతో ప్రభావితులైన ఉద్యమ కారులను నిలువరించలకపోయాడు. బద్రుల్‌ హసన్‌ ఖిలాఫత్-సహాయనిరాకరణ ఉద్యమం లో భాగస్వాములయ్యారు. విదేశీ వసువులను, వస్త్రాలను త్యజించారు. బ్రిటిష్‌ రాకుమారుడు భారత సందర్శన సందర్బంగా విదేశీ వస్త్రాలను తగులబెట్టి,నిజాం రాజ్యంలో అటువంటి కార్యక్రమాన్ని ధైర్యసాహసాలతో నిర్వహించిన తొలి తెలుగు బిడ్డడయ్యారు.

బద్రుల్‌ హసన్‌ ఖద్దరు ఉద్యమానికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చారు. ఖద్దరు ఉత్పత్తిని అత్య ధికం చేసేందుకు బొంబాయి నుండి రాట్నాలు తెప్పించారు. హెదారాబాదుదాు రాష్రంలో ఆధునిక రాట్నాలను ప్రవశపెట్టిన తొలి వ్యక్తిగా ఘనత వహించారు. ఆయన స్వయంగా ఖద్దరు ధారించారు. నైజాం పాలకుల అభిష్టానికి వ్యతిరేకంగా బద్రుల్‌ హసన్‌, అయన సోదరులు జాఫర్‌ హసన్‌లు సాంప్రదాయకమైన పైజామా బదులుగా ఖద్దరు ధోవతి, గాంధీటోపిని ధరించటంతో పాలకులు మండిపడినా హసన్‌ ఖాతరు చేయలేదు.

జాతీయోద్యమ ప్రచార కార్యక్రమాలను మరింత ముమ్మరం చేసేందుకు బద్రుల్‌ హసన్‌ దృఢంగా సంకల్పించారు. ఆ ప్రచారానికి అవసరమగు సాహిత్యాన్ని ఆయన సృష్టించారు. ఉద్యమ సహచరుల మధ్యన సమంవయం-సమాచారం కోసం 'హెదారాబాదు బుక్‌ డిపో' పుస్తక విక్రయ కేంద్రం ఆరంభించారు. ఈ బుక్‌డిపో ఆనాడు జాతీయోద్యమకారులకు ఒక రహస్య కూడలి ప్రదేశం అయ్యింది.

మహాత్ముని అడుగుజాడల్లో సాగుతున్న బద్రుల్‌ హసన్‌ గ్రామీణాభివృధ్ధి పట్ల అత్యధిక శ్రద్ధ కనపర్చారు. గ్రామాలలోని కుటీర పరిశ్రమలను, అంతరించి పోతున్న వృత్తి పనులను పునరుద్దరించాలని అభిలషించారు. ఆ దిశగా ఔత్సాహిక ప్రారిశ్రామిక వేత్తలను ప్రోత్సహిస్తూ పలు కుటీర పరిశ్రమల స్ధాపనకు దోహదకారయ్యారు. పరస్పర సహకారం ద్వారా పెట్టుబడుల సమస్యను అధిగమించగలమని, నైపుణ్యాన్ని అభివృద్ధి పర్చుకోగలమని విశ్వసించిన ఆయన సహకారోద్యమ ప్రారంభానికి కారకు లయ్యారు. సహకార రంగంలో సంస్థల స్ధాపనకు, సహకారోద్యమ వ్యాప్తికి శ్రమించారు. ఈ మేరకు హైదారాబాదులో సహకార వ్యవస్ధకు ప్రాణప్రతిష్ట చేసిన ప్రముఖులలో ఒకరయ్యారు.

ఈ విధంగా అటు బ్రిటిష్‌, ఇటు నైజాం పాలకవర్గాలకు వ్యతిరేకంగా నైజాం గడ్డ మీద స్వేఛ్ఛా-స్వాతంత్య్ర భావనలను పరివ్యాప్తి చేయడంలో మాత్రమే కాకుండా, మహాత్ముని అడుగు జాడల్లో గ్రామీణాభివృద్ధికి చివరి నిమిషం వరకు కృషిసల్పిన బద్రుల్‌ హసన్‌ 1937లో కన్నుమూశారు.

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌