పుట:చిరస్మరణీయులు, మొదటి భాగం.pdf/128

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

125

54. బేగం షంషున్నీసా అన్సారి

(- 1938)

మాతృభూమిని బ్రిటిష్‌ దాస్య శృంఖలాలనుండి విముక్తం చేయడానికి సాగిన స్వాతంత్య్రోద్యమంలో ఉద్యమకారుల మహిళలు ప్రత్యక్షంగా కాకున్నా పరోక్షమ్గా సహాయ సహకారాలు అందిస్తూ ఉద్యమానికి జవసత్వాలను అందిండంలో తిరుగులేని పాత్రను నిర్వహించారు. ఆ కోవకు చెందిన దానగుణశీలి బేగం షంషున్నీసా అన్సారి.

ఆమె ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు, ఢిల్లీకి చెందిన డాక్టర్‌ ముక్తార్‌ అహమ్మద్‌ అన్సారి భార్య. 1899లో డాక్టర్‌ అన్సారిని వివాహమాడిన ఆమె సాంప్రదాయక మత విద్యను అభ్యసించడంతోపాటు పర్షియన్‌, ఉర్దూ, అరబ్బీ బాషలలో ప్రావీణ్యం సంపాదించారు. సాహిత్య, రాజకీయ, సామాజిక గ్రంథాల పఠనం పట్ల ఆమెకు ఆసక్తి ఎక్కువ.

ఈ మేరకు సంతరించుకున్న పరిజ్ఞానం వలన సమకాలీన రాజకీయాల గురించి మహాత్మాగాంధీ లాంటి నేతలతో కూడా ఆమె చర్చించటం జరిగింది. ప్రముఖ నాయకులతో తన అభిప్రాయాలను పంచుకుంటూ, తన వైఖరి నాయకుల ధోరణికి విరుద్దంగా ఉన్నా తన అభిప్రాయాన్ని స్పష్టం చేయడానికి ఆమె ఏమాత్రం వెనుకాడలేదు. జాతీయ, అంతర్జాతీయ రాజకీయ పరిణామాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ భర్త అన్సారి

చిరస్మరణీయులు