పుట:చిరస్మరణీయులు, మొదటి భాగం.pdf/120

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

117

50. జస్టిస్‌ అబ్బాస్‌ తయ్యాబ్జీ

( 1854-1936)

'మహా వ్యక్తులకు మరణం ఉండదు. దేశం కోసం వారు చేసిన అపూర్వ త్యాగాలు ఆ మహానీయులను చిరంజీవులను చేస్తాయి..ఆయన ఉత్తవూత్తముడు. ఆయనను కలుసుకోవటం మహద్భాగ్యం' అని గాంధీజీచే ప్రశంసలందుకున్న ప్రముఖులు అబ్బాస్‌ తయ్యాబ్జీ. గుజరాత్‌ రాష్ట్రంలో 1854 ఫిబ్రవరి 1న సంపన్నతయ్యాబ్జీల కుటుంబంలో జన్మించారు. చిన్ననాటనే చదువు కోసం ఇంగ్లాండ్‌ వెళ్ళిన ఆయన1875లో బార్‌-ఎట్-లా చేసి ఇండియా వచ్చారు. 1893లో బరోడా ఉన్నత న్యాయస్థానంలో న్యాయమూర్తి పదవిని చేపట్టి ప్రతిభావంతుడైన న్యాయమూర్తిగా పేరుగడించారు.

జాతీయ కాంగ్రెస్‌ స్థాపన నాటి నుండి తయ్యాబ్జీ కుటుంబీకులకు కాంగ్రెస్‌తో విడదీయలేని సంబంధాలు ఉవన్నప్పటికీ, 1915లో మహాత్మాగాంధీజీతో కలిగిన పరిచయ, అబ్బాస్‌ జీవితాన్ని మలుపు తిప్పింది. భారత జాతీయ కాంగ్రెస్‌ ప్రారంభించక ముందే అబ్బాస్‌ నాయకత్వంలోని 'గుజరాత్‌ రాజకీయ పరిషత్‌' సహాయనిరాకరణ ఉద్యామాన్ని చేపట్టింది. రాజవంశీకులతో స్నేహసంబంధాలు కలిగి అత్యంత ఆడంబరమైన జీవితాన్ని సాగిస్తున్నఆయన 1919లో అన్ని విలాసాలకు స్వస్తిపలికి స్వదేశీ ఉద్యమంలో భాగస్వామి అయ్యారు. ఎనభై సంవత్సరాల వయస్సులో ఖద్దరును ప్రోత్సహించేందుకుగాను ఎద్దుల బండిలో 'విముక్తి వస్త్రాన్ని' విక్రయిస్తూ గుజరాత్‌ రాష్ట్రంలోని గ్రామాల్లో తిరిగారు.

చిరస్మరణీయులు