పుట:చిరస్మరణీయులు, మొదటి భాగం.pdf/119

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

116

ప్రారంభమైన హోమ్‌రూల్‌ ఉద్యమంలో ప్రముఖ పాత్ర నిర్వహించారు. 1919లో ఆయనకు జాతీయ కాంగ్రెస్‌ కమిటీలో స్థానం లబించటంతో జాతీయ కాంగ్రెస్‌ కార్యక్రమాలలో నిరంతరం పాల్గొంటూ వచ్చిన ఆయన జాతీయోద్యమకారునిగా ప్రత్యేక గుర్తిపు పొందారు.

అఖిల భారత ముస్లిం లీగ్ కార్యక్రమాలలో కూడా ఆయన పాల్గొన్నారు. ముస్లింలీగ్ లో ఉంటూ హిందూ-ముస్లింల ఐక్యత కోసం కృషి సాగించారు. స్వరాజ్యసాధనకోసం ఈ రెండు జనసముదాయాల మధ్య న సుదృఢమైన ఐక్యత అవసరమని భావించిన ఆనాటి ముస్లిం నాయకులలో ఒకరైన అహ్మద్‌ ఖాన్‌, 1919లో అమృతసర్‌లో జరిగిన లీగ్ సమావేశంలో ఈ అభిప్రాయాన్ని విస్పష్టం చేశారు. హిందూ-ముస్లింల ఐక్యతను సాధించేందుకు గోవులను ఖుర్బాని ఇవ్వడాన్ని ముస్లింలు మానుకోవాలని కోరుతూ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఆయన సమర్థించారు.1920 డిసెంబరులో జరిగిన లీగ్ సమావేశంలో అహింసాయుత పోరాటం, సహయ నిరాకరణోద్యమ కార్యక్రమాలకు పూర్తిగా మద్దతు తెలుపుతూ చేసిన తీర్మానాన్ని లీగ్ సమర్థించేలా చూశారు. ముస్లింలీగ్-జాతీయ కాంగ్రెస్‌ల మధ్యన సయోద్యకుదిర్చేందుకు అహర్నిశలు కృషి సల్పారు. 1920లో జాతీయ కాంగ్రెస్‌, ఖిలాఫత్‌ కమిటీల పిలుపు మేరకు ప్రారంభమైన ఖిలాఫత్‌ ఉద్యమం, సహయనిరాకరణ ఉద్యమాలలో భాగస్వాములయ్యారు. ఆ కారణంగా 1921లో తొలిసారిగా జైలు శిక్షకు గురయ్యారు. 1924లో పండిట్ జవహర్‌ లాల్‌ నెహ్రూ˙ సలహ మేరకు అలీఘర్‌ వదలి, అహ్మదాబాద్‌కు వచ్చిన ఆయన రాజకీయాలలో భాగం పంచుకుంటూనే మతసామరస్యం ప్రదాన లక్ష్యంగా ముందుకు సాగారు. పరాయి పాలన నుండి విముక్తి మాత్రమే కాకుండా మాతృభూమి ఉజ్వల భవిష్యత్తుకు హిందూ -ముసిం జనశ్రేణుల మధ్యపరస్పర అవగాహన, స్నేహం-సఖ్యత అత్యవసరమని ఆయన ప్రకటించారు. ఆ దిశగా నిరంతరం శ్రమించిన అహమ్మద్‌ ఖాన్‌ విభేదాల పరిష్కారానికి అవిశ్రాంతంగా కృషి చేశారు. మతోన్మాదాన్ని ఎవరు రెచ్చగొట్టినానా అంతిమంగా అది అందరికి అత్యంత ప్రమాదకారి కాగలదని ప్రజలను తీవ్రంగా హెచ్చరించారు.

జాతీయోద్యమకారునిగా, సంస్కరణాభిలాషిగా నిరంతరం ప్రజాసేవలో నిమగ్నమై కాలం గడుపుతున్న ఆయన 1932లో జాతీయ కాంగ్రెస్‌ పార్టీ నిషేదానికి గురైనప్పుడు నిర్భంధానికి గురయ్యారు. జయాపజయాలను సమాన దృషితో స్వీకరించే స్థిత పజ్నుడైనటి.అహమ్మద్‌ ఖాన్‌ షెర్వాణి పరాజయాన్నిపక్కనపెట్టి స్వాతంత్య్రసమర యోదుడిగా, సంఘసంస్కర్తగా కార్యక్రమాలను కొనసాగిస్తూ, 1935 మార్చి22న కన్నిమూశారు.

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌