పుట:చిరస్మరణీయులు, మొదటి భాగం.pdf/115

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

112

ప్రథమ ప్రపంచ యుద్ధ సమయంలో కామ్రెడ్‌ లో Choice of the Turks శీర్షికన రాసిన వ్యాసం ఆంగ్ల ప్రభుత్వ ఆగ్రహానికి గురియ్యింది.స్వతంత్ర భావనలను వ్యక్తం చేస్తున్న కామ్రెడ్‌, హందర్ద్‌ పత్రికల మీద కత్తివేటు పడింది. ఆ తరువాత మౌలానా, ఆయన సోదరులు షౌకత్‌ అలీని 1915లో గృహనిర్బంధానికి గురిచేసింది ప్రభుత్వం. ఆ గృహ నిర్బంధానికి కొద్ది రోజుల ముందుగా అలీ సోదరులు గాంధీజీని కలిసారు. ఆ కలయిక ఖిలాఫత్‌-సహాయ నిరాకరణ ఉద్యమంలో మౌలానాను గాంధీజీ మార్గాన నడిపించింది. ఇస్లామిక్‌ ధార్మిక సూత్రాల పట్ల అపార జ్ఞానంగల మహమ్మద్‌ అలీ ఖుర్‌ఆన్‌ సూకులను, ముహమ్మద్‌ ప్రవక్త ప్రవచనాలను ప్రస్తావిసూ,బ్రిటిష్ ప్రబుత్వానికి వ్యతిరేకంగా అనర్గళ ప్రసంగాలు చేస్తూ, సామాన్య ముస్లింలను మాత్రమే కాకుండా ధార్మిక పండితులను కూడాఉద్యమ దిశగా నడిపించారు. ఈ సందర్భంగా హిందూ- ముస్లింల ఐక్యతను కాంక్షించిన మౌలానా మత మనోభావాలకు భంగం కల్గించే ఆచార సాంప్రదాయాలను తక్షణమే విడనాడాలని ముస్లిం సమాజానికి సూచించారు.

1923లో జైలు నుండి విడుదలైన మౌలానాను భారత జాతీయ కాంగ్రెస్‌ అధ్యక్ష పదవి వరించింది. ఆ సమయంలో పెచ్చరిల్లిన మతవైషమ్యాలను నిరోధించి హిందు- ముస్లిల ఐక్యతను పషం చేసేందుకు 1927లో ముహమ్మద్‌ అలీ జిన్నా రూపొందించిన ఢిల్లీ ప్రతిపాదనలను జాతీయ కాంగ్రెస్‌ మద్రాసు సమావేశాలలో ఆయన అంగీకరింప జేశారు. ఆ తరువాత పండిట్ మోతిలాల్‌ నెహ్రూ˙ అధ్యక్షతన రూపొందిన 'నెహ్రూ కమిటీ రిపోర్ట్ ను అంగీకరించని మౌలానా 1928లో జాతీయ కాంగ్రెస్‌కు దూరమయ్యారు. ఆ తరువాత మహాత్మాగాంధీతో ఆయన సంబంధాలు సన్నగిల్లాయి. 1930లో ప్రథమ రౌండ్‌ టేబుల్‌ సమావేశానికి లండన్‌ వెళ్ళిన ఆయన ఆరోగ్యం క్షీణించినా తన కలాన్ని పక్కన పెట్టలేదు. చివరి క్షణం వరకు స్వేఛ్చ-స్వాతంత్య్రం గురించి ఆలోచనలు చేసూ,రాస్తూ గడపన మౌలానా అలీ 1931 జనవరి 3న హిందూ- ముస్లింల సమస్యను చర్చిస్తూ బ్రిటిష్‌ ప్రదానమంత్రికి సుదీర్గ… లేఖ రాయించారు. చివరకు 'నా దేశానికి స్వాతంత్య్రం ప్రకటించిన ఫర్మానా నా చేతుల్లోకి వచ్చినప్పుడు మాత్రమే నేను నా మాతృభూమి మీద అడుగు పెడతాను. నా దేశానికి స్వాతంత్య్రం ఇవ్వాలి లేదా నా సమాధి కోసం రెండు గజాల స్థలమన్నాఇవ్వాలి' అని ప్రకటించారు. ఆ విధంగా తన ఆకాంక్షను ప్రకటించిన మౌలానా ముహమ్మద్‌ అలీ జౌహర్‌ పరాయిపాలకుల నుండి విముక్తి, హిందూ-ముస్లిం ఐక్యతకై తన చివరిశ్వాస వరకు శ్రమిస్తూ 1931 జనవరి 4న కన్నుమూశారు.

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌