పుట:చిరస్మరణీయులు, మొదటి భాగం.pdf/116

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

113

48. సయ్యద్‌ హసన్‌ ఇమాం

( 1871-1933)

ప్రజలు ప్రగతిశీల దాకృధాన్ని అలవర్చుకోనిదే సాధించిన స్వరాజ్యఫలాలను సక్రమంగా అనుభవించలేరన్న దూరదృష్టితో అటు రాజకీయ పోరాటయోధులుగా, ఇటు సాంఘిక సంస్కర్తలుగా జాతీయోద్యమంలో బహుముఖ పాత్రలను పోషించిన ప్రముఖులలో సయ్యద్‌ హసన్‌ ఇమామ్‌ ఒకరు.

బీహార్‌ రాష్ట్రం పాట్నా జిల్లా నియోరా గ్రామంలోని సుప్రసిద్ధ, సంపన్న కవి-పండితుల కుటుంబంలో 1871 ఆగస్టు 31న ఆయన జన్మించారు. 1889లో ఉన్నత విద్యాభ్యాసం కోసం ఇంగ్లాండ్‌ వెళ్ళిన ఆయన బ్రిటిష్‌ వ్యతిరేక భావాలు కలిగిన భారతీయవిద్యార్థులతో కలసి కార్యక్రమాలలో పాలు పంచుకున్నారు. 1892లో నాయ్యవాదిగా భారతదశానికి తిరిగి వచ్చి ప్రాక్టీస్‌ ఆరంభించారు. 1910లో కలకత్తాకు నివాసం మార్చిన ఆయన మంచి న్యాయవాదిగా ఖ్యాతిగడించారు.

1908లో భారత జాతీయ కాంగ్రెస్‌ మద్రాసు సమావేశంలో పాల్గొన్నారు. విద్యార్థి- యవజనుల ఐక్య భాగస్వామ్యం ద్వారా ఏదైనా సాధించగలమన్న విశ్వాసం గల ఆయన 1909లో జరిగిన బీహార్‌ విద్యార్థుల సమావేశంలో చారిత్రక అధ్యక్షోపన్యాసం చేస్తూ ప్రగతి నిరోధక సాంప్రదాయాలను అలవాట్లను త్యజించి యువకులు అభ్యుదయ భావాలను

చిరస్మరణీయులు