పుట:చిరస్మరణీయులు, మొదటి భాగం.pdf/114

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

111

47. మౌలానా మహమ్మద్‌ అలీ జౌహర్‌

(1878-1931)

జాతీయోద్యా-మానికి కలికితురాయి అనదగిన ఖిలాఫత్‌ ఉద్యమంలో బృహత్తర పాత్రను నిర్వహించి, ఖిలాఫత్‌-సహాయ నిరాకరణోద్యమాలకు ప్రాణం పోసిన అలీ సోదరులలోని కనిష్టులు మౌలానా మహమ్మద్‌ అలీ జౌహర్‌.

ఉత్తర ప్రదేశ్‌ రాంపూర్‌కు చెందిన సంపన్న కుటుంబంలో 1878 డిసెంబర్‌ 10న మహమ్మద్‌ అలీ జన్మించారు. తండ్రి అబ్దుల్‌ అలీ, తల్లి ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధాురాలు ఆబాదిబానో బేగం. పసితనంలోనే తండ్రిని పోగొట్టుకున్నా, తల్లి ఆబాదిబానో జాతి రత్నాలనదగ్గ రీతిలో తన బిడ్డలను తీర్చిదిద్దారు.1888లో అలీ జౌహార్‌ అలీఘర్‌లో బి.ఎ. చేసి, ఆక్స్‌ఫర్డ్‌ వెళ్ళి బి.ఎ.(అనర్స్‌) చదివి ఇండియా వచ్చాక పలు ఉన్నత పదవులను చేపట్టి అవి నచ్చక చివరకు పాత్రికేయుడిగా స్థిరపడ్డారు.

1906లో అఖిల భారత ముస్లిం లీగ్ స్థాపనలో ప్రముఖ పాత్ర వహించిన ఆయన హిందూ-ముస్లింలు ఐక్యతతో ముందుకు సాగినప్పుడు మాత్రమే లక్ష్యాలను సాధించగలరని స్పష్టం చేశారు. ప్రజలలో రాజకీయ చైతన్యం లక్ష్యమ్గా 1911లో ది కామ్రెడ్‌ ఆంగ్ల వారపత్రికను, 1913లో హందర్ద్‌ ఉర్దూ దినపత్రికను స్థాపించారు. ముస్లింల స్థితిగతులను మెరుగుపర్చేందుకు,మౌలానా కృషి ఆరంభించారు.

చిరస్మరణీయులు