పుట:చిరస్మరణీయులు, మొదటి భాగం.pdf/107

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

104

ముస్లిం లీగ్ ల మధ్యన దోస్తీ కుదిర్చిన లక్నో ఒప్పందం అమలులోకి రావడానికి ప్రముఖ పాత్ర నిర్వహించారు. ఈ క్రమంలో అజ్మల్‌ ఖాన్‌ ఖిలాఫత్-సహాయనిరాకరణ ఉద్యమాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో బ్రిటిష్‌ ప్రభుత్వం అందజేసిన Kaisar-i-Hind, Hazq-ulMulk బిరుదులను, ప్రభుత్వం ప్రసాదించిన పలు పురస్కారాలను త్యజించిన తొలి భారతీయుడిగా అందరికీ ఆదర్శ ప్రాయుడయ్యారు. అన్ని ప్రముఖ నగరాలలో, పట్టణాలలో ఖిలాఫత్‌ కమిటీలు ఏర్పడేందుకు నిరంతరం శ్రమిస్తూ ఉద్యమం కోసం తన పలుకుబడిని ఉపయోగించి ఆయన భారీగా విరాళాలు సేకరించారు. 1917 నాటికే గాంధీజీ సన్నిహితులైన ఆయన క్రమంగా ముస్లిం లీగ్ కు సదూరమై ఆతరువాత భారత జాతీయ కాంగ్రెస్‌ సభ్యత్వం స్వీకరించారు. 1918 డిశంబర్‌లో జరిగిన కాంగ్రెస్‌ సమావేశాలకు ఆహ్వాన సంఘం అధ్యక్షు నిగా పనిచేశారు. ఖిలాఫత్‌ సమస్యపై 1920 జనవరిలో వైశ్రాయిని కలసిన ప్రతినిధివర్గంలో ఆయన పాల్గొన్నారు. 1921లో అహమ్మదాబాద్‌లో జరిగిన కాంగ్రెస్‌ జాతీయ సమావేశాల అధ్యక్ష స్థానాన్ని అలంకరించిన గౌరవాన్ని పొందారు.

జాతీయభావాలు గల విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన Jamia Milia Islamia (Nationa Muslim University) ప్రథమ ఛాన్సలర్‌గా బాధ్యతలు చేపట్టి ఆ విద్యాసంస్థ పటిష్టతకు కృషిచేశారు. 1922 మార్చి 10న మహత్మాగాంధీని అరెస్టు చేసినప్పుడు ఆయన స్థానంలో శాసనోల్లంఘన ఉద్యమ నిర్దేశకులుగా అజ్మల్‌ ఖాన్‌ నియుక్తులయ్యారు. 1922-23 మధ్యకాలంలో భారత జాతీయ కాంగ్రెస్‌, ముస్లింలకు నాయకత్వం వహిస్తున్న వివిధసంస్థల మధ్య సత్సంబంధాలు ఏర్పడడానికి ఆయన కృషి సల్పారు. హిందూ - ముస్లింల ఐక్యతకోసం అవిశ్రాంతంగా శ్రమించిన ఆయన 1924 సెప్టెంబరులో హిందూ -ముస్లిం నాయకులను ఆహ్వానించి తన ఇంట ఐక్యతా సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రధాన జనసముదాయాల మధ్య స్నేహసంబంధాల మెరుగుదలకు కృషి సల్పారు.

ఒక వైపు వైద్యం, మరొక వైపు రాజకీయాలు, ఇంకోవైపు విద్యావ్యాప్తికి నిరంతరం శ్రమిసున్నఅజ్మల్‌ఖాన్‌ SHAIDA అను కలం పేరుతో ఉర్దూ, పర్షియన్‌ భాషలలో రాసిన కవితలలో మానవత్వపు పరిమళాలు గుబాళించాయి. ఈ కవితలను డాక్టర్‌ జాకీర్‌ హుస్సేన్‌ DIWAN-SHAIDA పేరుతో 1926లో సంకలనంగా తెచ్చారు.

అనారోగ్యం కారణంగా 1925లో రాజకీయాల నుండి నిష్క్రమించినా హిందూ - ముసింల మధ్య సయాధ్య కోసం జీవిత చరమాంకం వరకు శ్రమించిన జాతీయోద్యమనేత హకీం అజ్మల్‌ ఖాన్‌ 1927 డిసెంబర్‌ 29న కన్నుమూశారు.

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌