పుట:చిరస్మరణీయులు, మొదటి భాగం.pdf/108

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

105

44.రజియా ఖాతూన్

(-)

భారత స్వాతంత్య్ర సంగ్రామం ప్రజానీకాన్నిఅన్ని రకాల త్యాగాలకు సిద్ధపర్చింది. అహింసామార్గంలో బ్రిటిష్‌ సేనల తుపాకి గుండ్లకు బలైన ఖుదాయే- ఏ-ఖిద్మాత్‌గార్‌లనూ (భగవత్సేవకులు), ఆయుధాలను చేతపట్టి బ్రిటిష్‌ పోలీసు-సైనిక దాళాలను తొడగొట్టి సవాల్‌చేసి రణరంగంలో వీరోచితంగా పోరాడి ప్రాణాలను బలిపెట్టిన సాయుధపోరాట యోధులైన విప్లవకారులను జాతీయోద్యమం సృజియించింది.

బ్రిటిషర్ల బానిసత్వం నుండి విముక్తి కోరుకుంటూ జమిలిగా సాగిన ఈ పోరాట మార్గాలు ఏవైనా అందులో పురుషులతోపాటు మహిళలు కూడా నడుం బిగించి మున్ముందుకు సాగారు. విముక్తి పోరాటంలో ఏమాత్రం వెన్ను చూపక ఆయుధం చేపట్టి పరాయి పాలకులైన బ్రిటిషర్ల వెన్నులో చలిపుట్టించారు. ఈ మేరకు బ్రిటిష్‌ ప్రబుత్వాన్ని సవాల్‌ చేసి హడలగొట్టిన ఆడపడుచులలో రజియా ఖాతూన్‌ ఒకరు.

ఆమె ప్రముఖ విప్లవయోధుడు మౌల్వీ నశీరుద్దీన్‌ అహమ్మద్‌ కుమార్తె. చిన్ననాటి నుండి ఆమెలో అంకురించిన దేశభక్తి భావనలు తండ్రి నుండి సంతరించుకున్న బ్రిటిష్‌ వ్యతిరేకతను తీవ్రతరంచేశాయి. స్వదేశాన్ని విదేశీ పాలకుల బానిసత్వం నుండి విముక్తం చేయాలని ఆమె సంకల్పించారు. తండ్రితో పాటు ఆమె కూడా జుగాంతర్‌ విప్లవ దళంలో

చిరస్మరణీయులు