పుట:చిరస్మరణీయులు, మొదటి భాగం.pdf/106

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

103

43. హకీం అజ్మల్‌ ఖాన్‌

(1868-1927)

భారతీయుల ఉమ్మడి లక్ష్యమైన స్వరాజ్యం సాధించేందుకు ఏకత్వంలో భిభిన్నత్వం, భిన్నరత్వంలో ఏకత్వం ప్రాతిపదికగా త్యాగాలకు ఆచరణాత్మకంగా సిద్ధపడిన ఈ గడ్డ ముద్దుబిడ్డలలో హకీం ఆజ్మల్‌ ఖాన్‌ ప్రముఖులు.

స్వదేశీ వెద్యంలో ప్రఖ్యాతిగాంచిన వెద్య ప్రముఖులు హకీం అబ్దుల్‌ గులాం మహమ్మద్‌ ఖాన్‌ తనయుడిగా అజ్మల్‌ ఖాన్‌ 1868 ఫిబ్రవరి 12న ఢిల్లీలో జన్మించారు. చిన్ననాటనే ఉర్దూ,అరబిక్‌, పర్షియన్‌ భాషలను నేర్చుకున్నారు. వెద్య శాస్త్రంతోపాటు, పలు శాస్త్రాలలో ప్రావీణ్యత గడించటమే కాకుండా మంచి వైద్యులుగా పేర్గాంచారు.

1906 వరకు ప్రజాసేవకు, స్వదేశీ వైద్యరంగానికి పరిమితమైన అజ్మల్‌ ఖాన్‌ 1906 అక్టోబర్‌ 1న సిమ్లాలో వైశ్రాయిని కలిసిన ముస్లిం ప్రముఖుల బృందంలో సభ్యునిగా పాల్గొన్నారు. ఆ తరువాత All India Muslim Educational Conference లో All India Muslim leauge ఏర్పాటు తీర్మానాన్ని సమర్థించారు. అనంతరం లీగ్ ఉపాధ్యక్షునిగా భాధ్యతలను చేపట్టి, హిందూ-ముస్లింల మధ్యా మతసామరస్యం కాపాడేందుకు, గోవులను ఖుర్బాని ఇవ్వడాన్ని మానుకోవాలని ముస్లింలు పిలుపునిచ్చారు. సయాధ్యను, సమైక్యతను సర్వదా కాంక్షించిన ఆయన 1916లో భారత జాతీయ కాంగ్రెస్‌,

చిరస్మరణీయులు