పుట:చిరస్మరణీయులు, మొదటి భాగం.pdf/101

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

98

ఉన్నప్పుడు, వారి లొంగుబాటుకు ప్రతిపాదనను తెచ్చిన పోలీసు అధికారితో ఆబాదిబానో బేగం మాట్లాడుతూ 'నా బిడ్డలు కనుక ప్రభుత్వ ప్రతిపాదానలను (లొంగుబాటు ప్రతిపాదానలు) అంగీకరిస్తే, నిస్సందేహంగా స్వయంగా నేను వారి గొంతు పిసికిచంపేస్తాను. ఆ మహత్తర కర్తవ్య నిర్వహణకు భగవంతుడు ఈ వృద్దురాలి చేతులకు అంతటి శక్తిని తప్పక ఇస్తాడు' అంటూ వచ్చిన దారిన బయటకు వెళ్ళమని పోలీసుఉన్నతాధికారికి ఇంటి నుండి బయటకు వెళ్ళే మార్గాన్నిచూపారు.

1917లో మొట్టవుదటి సారిగా ఆబాదిబానో గాంధీజీని కలిశారు. అప్పటి నుండిఆమెను గాంధీజీ కూడా అమ్మ అని పిలవటంతో, జాతీయోద్య\మకారులంతా ఆమెను బీబి అమ్మ అని సంబోధించసాగారు. 1917లో కలకత్తాలో జరిగిన జాతీయ కాంగ్రెస్‌ సమావేశాలకు, అఖిల భారత ముస్లిం లీగ్ మహాసభలకు హాజరైన ఆమె ఐక్యత ద్వారా మాత్రమే భారతీయులు వలసపాలకుల నుండి సంపూర్ణ స్వేచ్ఛ పొందగలరని ఉద్ఘాటించారు.'ఈ దేశంలోని హిందూ- ముస్లిం-శిక్కు-ఈశాయి ప్రజలంతా ఐక్యంగా ఉద్యమించనట్టయితే లక్ష్యం సిద్దించ జాలదు' అని హెచ్చరించారు.

1919 నాటి ఖిలాఫత-సహాయనిరాకరణ ఉద్యమంలో చాలా నిర్మాణాత్మక పాత్రను పోషించిన ఆమె అవిశ్రాంతంగా పర్యటనలు జరిపారు. ఉద్యమ నిర్వహణకు నిధులను సమకూర్చి పెట్టారు. జాతీయోద్యమకారులంతా తన బిడ్డలు కనుక వారి ఎదుట తనకు పర్దా అక్కరలేదని ప్రకటించారు. వృద్ధాప్యం వలన శరీరం సహకరించకున్నా జాతీయోద్యమంలో ప్రజలను భాగస్వాములను చేయడానికి పర్యటనలు జరుపుతూ 'భారతదేశపు కుక్కలు, పిల్లులు కూడా బానిసత్వపు సంకెకళ్ళలో బందీలుగా ఉండరాదాన్నది నా అభిమతం' అని తాను మాట్లాడిన సబలలో సాహసంతో ప్రకటించారు. ఆ కారణంగా పోలీసులు ఆమెను ప్రమాదకర విద్రోహిగా పరిగణించారు. ఆమె మాత్రం పోలీసు హింస, అరెస్టులు, లాఠీచార్జీలను ఏమాత్రం ఖాతరు చేయకుండా ముందుకు సాగారు.

ఆమె రాజకీయ రంగంలోనే కాకుండా సామాజిక రంగంలో కూడా తనదైన భాగస్వామ్యాన్ని అందిస్తూ అఖిల భారత మహిళల సంఘాలకు మార్గదర్శకం చేశారు. చివరి వరకు ఉద్యమకారుల కుటుంబాలకు చెందిన మహిళలకు అన్ని విధాల సహకరిస్తూ ఆదర్శవంతంగా నిలిచారు. అనారోగ్యం, వృద్ధాప్యం, పోలీసుల ఆగడాలు, ఆటంకాలను లెక్క చేయకుండా జాతీయోద్యమంలో చురుకైన పాత్ర నిర్వహించిన ఆబాదిబానొ బేగం 1924 నవంబరు 13న తన బిడ్డలు, మహాత్మా గాంధీజీ చెంత నుండగా ప్రశాంతంగా కన్నుమూశారు.

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌