పుట:చిరస్మరణీయులు, మొదటి భాగం.pdf/100

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

97

40. ఆబాదిబానో బేగం

(1852-1924)

జాతీయోద్యమంలో పురుషులతోపాటు అద్వితీయమైన భాగస్వామ్యాన్ని అందించిన మహిళలలో ఆబాదిబానో బేగం అగ్రగామి.

ఉత్తర పదశ్‌ రాష్ట్రం మొరాదాబాద్‌ జిల్లా అమ్రోహా గ్రామంలో 1852లో ఆబాదిబానో బేగం జన్మించారు. ఆమెకు రాంపూర్‌ సంస్థానానికి చెందిన అబ్దుల్‌ అలీ ఖాన్‌తో వివాహం జరిగింది. చిన్న వయస్సులో భర్తను కోల్పోయినా పునర్వివాహం చేసుకోకుండా బిడ్డలైన మౌలానా ముహమ్మద్‌ అలీ, మౌలానా ష్ధకత్‌ అలీల భవిష్యత్తు మీద దృష్టి సారించి, వారిని జాతీయోద్యమ నేతలుగా ఆమె తీర్చిదిద్దారు

ఆబాదిబానో రాజకీయ జీవితం హోంరూల్‌ ఉద్యమంతో ఆరంభమైంది. ఈ ఉద్యమం మరింతగా విస్తరించేందుకు ఆమె ఆర్థిక, హార్థిక సహాయసహకారాలను అందించడమే కాకుండా నిబద్దత గల ఉద్యమకారిణిగా పనిచేశారు. బ్రిటిష్‌ ప్రభుత్వం ఇండియన్‌డిపెన్స్‌ రగ్యులేషన్స్‌ తెచ్చి జాతీయోద్యమకారులైన అలీ సోదరు లను చిందన్వాడ గ్రామంలో నిర్బంధించగా ఆమె కూడా వారి వెంట వెళ్లారు. ఈ సందర్భంగా మాతృదేశం, జాతి జనుల కోసం కష్టనష్టాలను భరించేందుకు భగవంతుడు ఎంపిక (తన బిడ్డలను) నిజంగా గర్వించదగిన విషయం అని ఆమె ఆనందం వ్యకంచేశారు. అలీ సోదరులు నిర్బంధలో

చిరస్మరణీయులు