పుట:చిరస్మరణీయులు, మొదటి భాగం.pdf/102

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

99

41. మౌల్వీఅబ్దుల్‌ బారి

(1878-1926)

భారతదేశంలోని ముస్లిం ధార్మిక ప్రముఖుల మార్గదర్శకత్వంలో ఏర్పడిన పలు విద్యాకేంద్రాలు ధార్మిక విద్యను బోధించటమే కాకుండా బ్రిటిషర్ల పట్ల తీవ్ర వ్యతిరేకతనూ ప్రబోధించాయి. ఆ క్రమంలో 'మదారసా-ఏ-నిజామియా' ను స్థాపించిన విద్యావేత్త మౌల్వీ ఖయ్యాముద్దీన్‌ ముహమ్మద్‌ అబ్దుల్‌ బారి ఫిరంగి మహాల్‌.

మౌల్వీ అబ్దుల్‌ బారి లక్నోకు చెందిన ప్రఖ్యాత ఫిరంగి మహాల్‌ ఉలేమాల కుటుంబంలో 1878లో జన్మించారు. తొలుత తండ్రి వద్ద, ఆ తరువాత పలువురు మౌల్వీల శిష్యరికంలో ధార్మిక విద్యను అభ్యసించి, ఆ తరువాత కాంస్టాట్ నోపుల్‌లో ఉన్నత విద్యను పూర్తిచేసిన ఆయన ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించారు.

ముస్లింలలో చైతన్యం, వలసపాలకుల పట్ల వ్యతిరేకత ప్రోదిచేయడంకోసం 1908లో 'మదారసా-ఏ- నిజామియా' స్థాపించి, ఆ విద్యాకేంద్రం మహోపాధ్యాయునిగా బాధ్య తలను చేపట్టారు. ఈ సంస్థ ఆ తరువాత కాలంలో బ్రిటిష్‌ వ్యతిరేక కార్యకలాపాలకు, ఉద్యమకారులకు, విప్లవకారులకు కేంద్రంగా భాసిల్లి స్వాతంత్య్రసమరంలో తనదైన పాత్రను నిర్వర్తించింది.

1913లో ప్రఖ్యాతి చెందిన 'కాన్పూరు మసీదు' సంఘటన రంగం మీదకు వచ్చింది.

చిరస్మ రణయులు