Jump to content

పుట:చిత్రభారతము (చరికొండ ధర్మన).pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


నట్టిమహాత్ముండ వబ్జాక్షపాదార
             విందభృంగమవు వివేకనిధివి
నీరాకచేతను [1]నెగడె మత్పుణ్యంబు
             లనఘాత్మ నీ వెఱుంగని దొకింత


తే.

యైనఁ గాలత్రయమునందు నరసి చూడ
లేదు ప్రాక్తనరాజావళీవిశేష
చరితములలోన మిగులనాశ్చర్యహేతు
వయినకథ యెద్ది యది నాకు నానతిమ్ము.

38


క.

నరనారాయణు లనఁగాఁ
బరఁగి నిరంతరము [2]సఖ్యభానోన్నతిఁ ద్రి
మ్మరు కృష్ణులకుం దమలో
దుర మయ్యె న దేమినెపము దొరలి మునీంద్రా.

39


తే.

పాండుసూనులఁ బొదువునాపదలు మాన్పఁ
బాలుపడి శోభనంబులు గీలుకొలుపఁ
జాలి చుట్టంబు మంత్రియు సఖుఁడు నగుచుఁ
గృష్ణుఁ డతిభక్తి వారి రక్షించు నెపుడు.

40


శా.

ఆకుంతీసుతులందు నర్జునునితో నత్యంతమున్ మైత్రిమై
నాకృష్ణుండు మెలంగుఁ దొల్లి బలభద్రాదుల్ కడంక సుభ
ద్రాకన్యామణి రాజరాజునకు నీఁ దర్కించుచుండంగ మా
యాకృత్యంబున నీయఁడే నరున కయ్యబ్జాతపత్రేక్షణన్.

41


క.

దివిజులు భయమందఁగ ఖాం
డవవన మనలునకు నిచ్చునాఁ డాలక్ష్మీ
ధవుఁడు సహాయం బై ని
ల్చి విజయునకు జయ మొసఁగఁడె లీలయపోలెన్.

42
  1. నీడేఱె
  2. సత్యభాషారతి