Jump to content

పుట:చిత్రభారతము (చరికొండ ధర్మన).pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

భోగవతీదక్షిణతట
భోగవతీపురమునందు బుధులు నుతింపన్
భోగవతీసతితో బహు
భోగవిశేషములఁ బ్రొద్దుపుచ్చుచు నుండెన్.

32


వ.

అంత.

33


చ.

అతఁ డొకనాఁడు మంత్రులు మహారసికు ల్మునులుం గవు ల్భుదుల్
హితులుఁ బురోహితు ల్సరసిజేక్షణలుం బరివారమున్ దొరల్
చతురతఁ గొల్వ నైందవశిలాపరికల్పితసౌధవేదికో
న్నతనవరత్నకీలితకనత్కనకాససమధ్యవర్తి యై.

34


వ.

పేరోలగం బున్నయవసరంబున.

35


చ.

భువనములం బ్రసిద్ధిఁ గని పొల్చిన సద్ద్విజకోటికన్న నె
క్కువయగుహంసచక్రములు గోరి భజింపఁగ నంబుజాక్షుఁ బె
క్కువిధములు స్మరించుపలుకుల్ శ్రుతియోగ్యము లై చెలంగ ము
క్తివనితచేతికీరమనఁ [1]దేఱి శుకుం డరుదెంచె వేడుకన్.

36


తే.

ఇట్లు వచ్చిన శుకయోగి నెదురుకొని సు
ఖాసనాసీనుఁ గావించి యర్ఘ్యపాద్య
ముఖ్యపూజావిశేషసమ్ముదితుఁ జేసి
ప్రణతు లొనరించి మధురోక్తిఁ బలికె నతఁడు.

37


సీ.

అనవరతంబు నత్యానందకారి వై
             కామరోషవికారగరిమ మడఁచి
సులభుఁ డై ద్విజరాజచూడావతంస మై
             దనరెడు సర్వజ్ఞు ననుకరించి

  1. జేరి