Jump to content

పుట:చిత్రభారతము (చరికొండ ధర్మన).pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


దనవారిలోన మెలఁగినఁ
దనవారిఁగఁ జేసి హరునితల యెక్కించెన్.

26


వ.

అమ్మహకూలంకషాకూలప్రదేశంబున నమరావతియుంబోలె
విబుధాలయం బై యర్చిష్మతియున్ బోలె శుచిస్థానం బై
సంయమనీనిలయంబునుంబోలె ధర్మాధిష్టానం బై పుణ్యవతి
యుంబోలెఁ బుణ్యజనావాసం బై యమలావతియునుంబోలె
రత్నాకరం బై గంధవతియుంబోలె మహాబలనివాసం బై
యలకానగరియుంబోలె ధనదాశ్రయం బై యైశాన్యం
బునుంబోలె సర్వజ్ఞక్షేత్రం బై యెప్పి భోగవతి యన
నొక్కపురంబు గలదు.

27


క.

ఆపురమున కధిపతి యై
యేపట్టున రాజనీతి యెడలక ధర్మ
వ్యాపారం బుడుగక యౌ
లూపేయుఁడు దందశూకలోకం బేలున్.

28


తే.

అతఁ డిలావంతుఁ డనుపేర నమరు టెఱిఁగి
యును కరీంద్రధరాహీశులును మదించి
తా రిలావంతు లనుకొన్నదాన వారి
సత్వధైర్యమనీషలు జడుపుగొనియె.

29


తే.

ధర్మవర్తన భీమప్రతాపమహిమ
నర్జునఖ్యాతి తనయందు ననువుపఱుచు
సత్యమున సత్వమున శరాసననిరూఢి
మీఱి [1]తనతండ్రులను విడంబించె నతఁడు.

30


వ.

అని మఱియును.

31
  1. తలిదండ్రులను