Jump to content

పుట:చిత్రభారతము (చరికొండ ధర్మన).pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తే.

జలజనిలయాధినాయకచరణనీర
జాతజాతతరంగిణీసత్ప్రవాహ
వారిపూరపవిత్ర మై భూరిమహిమఁ
బొలిచెఁ బాతాళభువనంబు పుణ్యధనము.

21


చ.

బలువగు [1]వేల్పుఱేని నునుఁబానుపునుం గనుపట్టునిల్లు వె
న్నెలతలకానిసొమ్ముగమి నించినపెట్టియ యెట్టివేళలం
బులుఁగులరాచవారికలవోకలకుం జొరరాని యిక్క పెన్
జిలువలమన్కిప ట్టనుచుఁ జెప్పఁగ నొప్పు రసాతలంబు దాన్.

22


క.

నాకులలోన మెలంగియు
నాకులఁ దమమహిమచేఁ దృణంబుగ మది నా
లోకించి భుజగవరులు ని
రాకులతఁ జరింతు రమ్మహానిలయమునన్.

23


తే.

కుటిలగతిఁ దమకు నిజముగఁ గూర్చినట్టి
తామరసగర్భుమర్యాదఁ దప్పరామి
భావమున నూహ చేసి యాఫణికులంబు
లాత్మ కాంతాలకంబులయందు నిడియె.

24


శా.

ఆభూమిన్ బ్రవహించు నెప్పుడు నపర్ణాధీశమౌళిస్థగం
గాభంగామలపద్మగంధనికరవ్యాప్తప్రవాహాఢ్య [2]యై
యాభోగావతి పన్నగేశఫణదీవ్యత్పద్మరాగచ్ఛటా
శోభానూనహిరణ్మయాంబుజములన్ జూడంగ నింపొందుచున్.

25


క.

వినుఁ డానది శ్రుతిబాహ్యులు
ననవరతముఁ గుటిలగతులు నగుభోగివరుల్

  1. నల్లవేల్పు
  2. తా, నై భాగీరథి