Jump to content

పుట:చిత్రభారతము (చరికొండ ధర్మన).pdf/221

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గర్జంబు దప్పెనని కటకటంపడి కొండొక చింతించి కుంతీ
తనయాగ్రజు నుద్దేశించి యిట్లనియె.

90


శా.

అక్రూరుం డరుదెంచి యీకొలువులో నత్యంతవాక్ప్రౌఢి నా
చక్రిన్ సంగరకేళి గెల్వఁగ సరోజాతోద్భవుల్ నూర్వురున్
శక్రుల్ వేవురునైన నోపరనె నాచందంబు నిక్కంబు యు
ద్ధక్రీడ న్మన మెంత నీకు నయశాస్త్రప్రక్రియం జెప్పెదన్.

91


చ.

వినయవివేకభూషణుఁ బ్రవీణుఁ గులీనుఁ బరేంగితజ్ఞు స
త్యనిరతు బుద్ధిమంతు నుచితప్రదుఁ గార్యదురంధరున్ గృపా
త్ము నతిగుణాకరున్ బతిహితున్ జననాథుఁడు రాయబారిఁ జే
సిన నతఁ డెట్టులైన ఫలసిద్ధిగఁ జేయు సమస్తకృత్యముల్.

92


వ.

కావున నిట్టిగుణంబులు గలవాని నయ్యాదవవల్లభుపాలికిం
బెట్టి పంపుదమనుడు వల్లెయని కౌంతేయాగ్రజుండు తనతో
విచారింప శంతనుతనయుం డిట్లనియె.

93


క.

దేవాజేయుఁడు బలముస
దేవాచార్యుండు నీతి ధీరత్వమునన్
దేవాచలంబు మన సహ
దేవుండని బుద్ధిఁ దెలిసిలిన్ ధర్మసుతా.

94


క.

అని యెఱిఁగించిన యమనం
దనుఁ డప్పుడు పిలిచి నకులుతమ్ముని నాశాం
తనవుని ముందఱ [1]నిడ నా
తనితో [2]నతఁ డిట్టులనె నుదారప్రౌఢిన్.

95
  1. నిడి యా
  2. నిట్లనియెఁ దా