Jump to content

పుట:చిత్రభారతము (చరికొండ ధర్మన).pdf/220

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


డఱిముఱిఁ గాచినట్టి మనుజాధిపుఁ బైకొని బ్రహ్మరుద్రు లే
డ్తెఱఁ జనుదెంచిరేనియు వధింపఁగనోపుదురే తలంపఁగన్.

84


క.

కావున నీ కుండినపతిఁ
గావు నయం బెసఁగ నట్లు గాదా నన్నున్
దేవేంద్రనందనుని వసు
దేవతనయ! చూచి యెఱుఁగుదేకద యనుమీ.

85


వ.

అనిన యనంతరం బర్జునుం డిట్లనియె.

86


చ.

నిను మనఘాత్మ నన్ను నరవిందదళేక్షణుఁ డింతవానిఁగాఁ
బెనిచె నటైన నీనృపతి భీతిలి చేరినఁ గాచినాఁడ నీ
తనికయి చచ్చుటొండె రణధారుణిలో గెలుపొండె మేలుగా
కని వినిపింపునిమీ కొలువునందు బలాదు లెఱుంగునట్లుగన్.

87


వ.

అని పలికె నంత భీష్మాదులెల్ల దేవరసముఖంబునకు నొక
బుద్ధిమంతు నంపెదమని న న్నంపిన నేనుం జనుదెంచితినని
విన్నవించిన నయ్యరవిందనయనుండు గించిదరుణితలోచ
నుండై కొలువు గలయం గనుంగొని.

88


చ.

వినఁ గడుఁజోద్య మయ్యెఁ బృథివీవరకోటులతోడఁ గూడి నేఁ
గినిసిన కుండినేశ్వరునిఁ గ్రీడియె కావఁగఁ [1]బూనె నట్టె యే
మనఁగలవార మన్న ముసలాయుధుఁ డాలము సేయఁబూనెఁ జే
పనిగుడ మార సాంబకృతవర్ములు నవ్విరి గేలిఁ బెట్టుచున్.

89


వ.

మఱియుఁ దక్కినవారెల్లను వీరాలాపంబు లాడుచుండి
రంత నిక్కడ ధృతరాష్ట్రుండు విదురసంజయులతోఁ గూడఁ

  1. బూనెనంట