Jump to content

పుట:చిత్రభారతము (చరికొండ ధర్మన).pdf/197

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


దనపలుకు నిలిపి సురలకుఁ
దను వొసఁగి దధీచి కీర్తిధన్యుఁడు గాఁడే.

205


క.

శరణాగతుఁ డగువానిన్
గరుణం దనువైన నిచ్చి కావఁగఁదగు భూ
వరునకుఁ బక్షికినై తన
శరీరమాంసంబు శిబి యొసంగఁడె కరుణన్.

206


క.

జీమూతవాహనుం డొక
పామునకై విహగపతికిఁ బ్రాణము లీఁడే
యామాట సూర్యచంద్రులు
భూమియుఁ గలకాలమును విబుధులుఁ బొగడఁగన్.

207


క.

శరణా[1]తు గాచిన భూ
వరుఁడు దురగమేధయాగవర్గముఁ బుణ్యం
బరుదుగఁ జేకొనలేదా
నరకమునం [2]గూలి వేదనలఁ బడు నెపుడున్.

208


క.

కావున శరణాగతుని
భూవరుఁ గాచెదను సమరభూమిన్ హరిచే
జావైన లెస్స యటుగా
దా విజయంబైన మిగుల ధన్యత గాదే.

209


క.

తాతకును ధర్మసూతికి
నీతెఱఁ గెఱుఁగంగఁ జెప్పి యేనును వారుం
జేతనగుకొలఁదిఁ బెనఁగెద
మాతల [3]మఱి దైవ మున్నదని యాతనితోన్.

210
  1. తరక్షకు
  2. గూడి
  3. నున్నాఁడు దైవ మని యాతనితోన్.