Jump to content

పుట:చిత్రభారతము (చరికొండ ధర్మన).pdf/175

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ.

ఇట్లు ధరించి.

88


ఆ.

మనుజకామినులకు విను దేవతాయోగ్య
వస్తువితతి యొసఁగ వలను గాదు
సత్యభామ, పారిజాతపుష్పంబులు
నీకు నీయరాదు నిక్కువంబు.

89


వ.

అని పులోమజ శ్రీకృష్ణుప్రభావం బెఱుంగనిదై నోనాడిన
నాహరిప్రియ యచట నిల్వక తనవిడిదికి నరిగి.

90


ఉ.

ఈసును గోపము న్మది వహించి పులోమజవేఁడిమాటకై
గాసిలి మేనసొ మ్ముడిపి కన్నులఁ గ్రమ్మెడునీటఁ జందనం
బోసరిలంగఁ జేసి శిర మొయ్యన వంచి కపోలపాళిపైఁ
జే సమకొల్పి యొక్కయెడఁ జింతిలుచుండెడునంతలోపలన్.

91


మ.

హరి యబ్భామినిఁ జేరవచ్చి యను నీ వానందశూన్యాత్మ వై
పరితాపంబునఁ బొంద నేమినెప మాపౌలోమి [1]కల్పించెఁ? బె
ద్దఱికం బేమియుఁ జేయదో యచటికాంతల్ నిన్ను నెగ్గాడిరో
హరిఁగన్నమ్మయు గారవింపదొకొ నెయ్యం బొప్పఁగా మానినీ!

92


చ.

నరకునితోడఁ బోరునెడ నా కొకయించుక కేలు డస్సినన్
సుర లరుదంది నీవిధముఁ జూడ శరావలిచేత వైరితో
దుర మొనరించు సాహసము [2]దూఁకొని పైకొని కన్యకావళిం
బరిణయమౌటకై పురికిఁ బంపినయందుకుఁ గోపగించితో.

93


ఉ.

ఏమిటి కింతవంత తరళేక్షణ! చెప్పుమటన్న లేచి య
బ్భామిని చన్నుదోయిపయిఁ బయ్యెదకొంగు దలంగి జాఱ నె
మ్మో మరవాల్చి యూరుపుల ముంగరముత్యము గంద నేడిచెన్

  1. గర్వించి పె
  2. తో విడిపించినకన్యకావళిం