పుట:చారుచర్య (అప్పకవి).pdf/4

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
19. అశ్వవైద్యము- (Horses) మనుమంచిభట్టు

వాతావరణము వ్యవసాయము (Meteorology & Agriculture)

20. సస్యానందము - దోనయామాత్యుడు

ధాతుశాస్త్రము (Precious metals)

21. రత్నశాస్త్రము - భైరవకవి (Metallurgy)

సాముద్రికశాస్త్రము (Palmistry)

22. సాముద్రికశాస్త్రము - అన్నయమంత్రి

వేదాంతశాస్త్రము (Philosophy)

23. జ్ఞానవాసిష్టము - మడికిసింగన

కవి కాలము

ఈ గ్రంథరచయిత అప్పనమంత్రి గూర్చి చారుచర్యలో తెలిసినదానికంటె హెచ్చుగా మన కేమియు తెలియరాలేదు. ఈచారుచర్యలోగల 35వ పద్యము “కొనగొని కొండముచ్చులు చకోరములున్ శుకశారికావళుల్" అను 35-వ పద్యము మడికి సింగన సకలనీతిసమ్మతములో నుదాహరించినాడు. సింగనకాలము క్రీ. శ. 1400 ప్రాంతము కావున అప్పన యంతకుముందువా డగును.

అనువాదరీతి

మూలశ్లోకములను కొన్నిటిని వేర్వేఱుగా చిన్నపద్యములు గాను, 4, 5 శ్లోకములను సీసముగాను వ్రాసి