పుట:చారుచర్య (అప్పకవి).pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యున్నాఁడు. మొత్తముపైని యాంధ్రీకరణము బాగుగనున్నది. మచ్చునకు—

శ్లో.

మలినం పరవస్త్రంచ స్త్రీవస్త్రంచ తథైవచ,
ఖండంచ మూషకైర్విద్ధ మగ్నిదగ్ధంచ వై త్యజేత్.


ఆ.

మలినమైన యదియు మగువ గట్టినయది
నితరజనులు యదియు నెలుకపోటు
ఖండమైన యదియు గాలినయదియు వ
ర్జింపవలయుఁ జుమ్ము చీరలందు.

25-వ పద్యము

శ్లో.

లోకే౽స్మిన్ మంగళాన్యష్ట బ్రాహణోగౌర్హుహుతాశనః
హిరణ్యం సర్పిరాదిత్య ఆపోరాజాతథాష్టమః.


క.

గోవుం గనకము విప్రుఁడు
పావకుఁడు ఘృతంబు జలము భానుండు ధరి
త్రీవిభు డీయెనిమిదియు శు
భావహములు మంగళాష్టకాఖ్యం జెందున్.

30-వ పద్యము

ఈగ్రంథముద్రణమున కీక్రిందిప్రతులు తోడ్పడినవి.

1. తాళపత్రప్రతి (తెనుగు) ఆంధ్రసాహిత్యపరిషత్పుస్తకభాండారము సంఖ్య 3875