శా. |
నాళీకాంబకు సారె దూఱుకొనుచు న్నామ్రోల కేతెంచి [1]నీ
వీలా గేల వహింప నేఁటి కకటా యేఁ జెల్ల నీసాహసం
బేలా పూనెద నమ్మ లాఁతి[2]వలె నీయిష్టంబుఁ జేకూర్చెదం
జాలుంజాలుఁ గలంక మాను మని యాశాచక్ర మీక్షించినన్.
| 97
|
క. |
గ్రమ్మన నగ్రధరిత్రిని, దమ్మునితోఁ గూడివచ్చు తననాయకునిన్
సమ్మోదజలధిఁ దేలుచు, [3]నమ్ముద్దియ చూచి యవనతానన యైనన్.
| 98
|
ఉ. |
కోమలి నీదునెమ్మనము కోర్కి ఘటిల్లెఁ గదమ్మ భూవర
గ్రామణి నీమనో౽౦బుజము కాంక్షిత మబ్బెఁ గదయ్య యంచు ల
క్ష్మీమృగనేత్ర యొండొరులచిత్తము రంజిలఁ బల్కి భక్తర
క్షామహనీయదృష్టి నల సాత్యకిపుత్రుని జూచి నెమ్మితోన్.
| 99
|
క. |
ఓవిజయలోల యిప్పుడ, తావకహృదయాబ్జవాంఛితము సేకుఱుఁ జిం
తావిలత వలవదని పూ, ర్వావస్థితి నుండె నంబుజాలయ యంతన్.
| 100
|
చ. |
చతురతరాంతరంగుఁ డయి సాత్యకిసూనుఁడు వల్కు నన్న యీ
యతివయు నీవుఁ గిన్నరవరాత్తమనోజ్జరథంబుచేత ను
[4]ద్ధృతగతి నేగి పేరడవి రుద్రగృహంబున నుండు మేఁ దద
ర్పితనవకామరూపకళపెంపున బిత్తరి నై శుభోన్నతిన్.
| 101
|
ఉ. |
పాలకి నెక్కి యేగెద నృపాలనిశాంతముఁ జేరఁబోవుచో
జాల నదృశ్యవిద్య మెయి జాఱెదఁ గ్రమ్మఱ మిమ్ముఁ జేరెదన్
శ్రీలలనాప్రసాదమునఁ జింతిలుకార్యము సంఘటించె నిం
కేల విలంబ మంచు నల యిర్వుర వీడ్కొని సంభ్రమంబునన్.
| 102
|
క. |
కాంతాకారముఁ గైకొని, యంతర్గేహంబు వెడలి యల్లన చెలువల్
ప్రాంతమునఁ గొల్వఁ బాలకి, యెంతయు ముద మొప్ప నెక్కి యేగెడువేళన్.
| 103
|
విజయలోలుఁడు పద్మినితోఁ భాషించుట
ఉ. |
అంత నవంతిదేశపతి యౌ ననువిందునిపుత్రి పద్మినీ
కాంత తదంబుజాననకుఁ గాదిలినెచ్చెలి గానఁ జెంగటన్
సంతస మొప్ప నేగుచుఁ బ్రసంగవశంబునఁ బల్కరించి యే
కాంతమున న్నృపాలసుత యంచునె [5]త్యకిపట్టి కి ట్లనున్.
| 104
|
- ↑ చ-ట-నీలా గార్తి వహింప నేటి కకటా యేఁగల్గ
- ↑ చ.వనె
- ↑ చ-నమ్ముదితయు
- ↑ యిరులగువడి
- ↑ చ-సాత్యకినూను కి ట్లనున్