Jump to content

పుట:చంద్రభానుచరిత్రము (తరిగొప్పుల మల్లన).pdf/128

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


[1]చ.

చెలియ వృధావిచారమునఁ జిత్తము నొంపఁగ నేల యిట్టు లా
విలగతి నున్కి మేలె శుభవేళ మదిం గలవంత యేరికిన్
[2]దెలియకయుండు టొప్పదె సతీమణికి న్మఱియెవ్వరేనియుం
గలకల నవ్వకుందురటె కామిని నీచరితంబుఁ గాంచినన్.

105


చ.

సరసిజపత్రనేత్ర వెడచందము మానుము నీదుకోరికల్
తరళిక తెల్ప వింటి నిది ధర్మమె కూరిమి తల్లిదండ్రు లే
వరున కొసంగిన [3]న్సుతలు వాఁడె విభుం డని [4]భక్తియుక్తలై
పరిణయ మౌటగాక తమభావమునం గలవాఁడు గల్గునే.

106


ఉ.

ఇన్నియుఁ బల్క నేల వినవే నిను నొక్కతె దూఱనేటికిన్
మున్ను మదీయచిత్త మొకమోహనరూపవిలాసధన్యుపైఁ
గన్నువిరాళిఁ జిక్కి రతికాంతునిబారికి నగ్గమయ్యె నో
కిన్నరకంఠి నీకు నెఱిఁగించెద నత్తెఱఁ గాలకింపుమీ.

107


సీ.

ఒక్కనాఁ డే వార్షికోత్సవంబునఁ బొల్బు హరిఁ గొల్చుటకు శేషగిరికి నేగి
యచటివినోదంబు లరయుచు నెచ్చెలుల్ గొలువఁగాఁ దుంబురుకోనఁ జేరి
[5]యొరపైన యాచెంత గురివెందపొదరిండ్ల లీల దోలాకేళిఁ దేలుచుండి
గ్రక్కున నత్తఱిఁ గమ్మవిల్తుని గెల్వఁజాలిన యొక్కరాచూలిఁ గాంచి
పరమసమ్మోదమును జెంది మరలియేగు
వేళ మదహస్తిఁ గనుఁగొని వెఱచి యతని
నలమికొని యుండఁగా బోటు [6]లంత వచ్చి
పిలుచుటయుఁ బాసి వచ్చితి నలరుఁబోఁణి.

108


గీ.

నాఁటనుండియు నతని గానంగలేక
చింతఁ గుందెద నన మహీకాంతసుతుఁడు
బాపురే యగు నిదియ యా[7]పద్మనయన
యనుచుఁ గృతనిశ్చయుం డయి యబల కనియె.

109


క.

ఆకాంతుఁ డిపుడు వచ్చినఁ, గైకొందువె యనినఁ దరుణి కనుఁగవ నశ్రుల్
వ్యాకీర్ణముగా గద్గది, కాకులనిస్వనముతోడ నలనాలసయై.

110


ఉ.

అక్కట చాలు నన్ను నిఁక నాఱడి పెట్టకు వమ్మ యాతనిం
జిక్కనికౌఁగిటన్ బిగియఁ జేర్పఁ బురాకృతపుణ్యవాసనం

  1. ట-లో నీపద్యము లేదు.
  2. చ-దెలుపక
  3. చ-ట-సతులు
  4. చ-ట-భక్తియుక్తిమై
  5. చ-ట-గుబురైన
  6. చ-ట-లరయవచ్చి
  7. చ-పద్మగంధి