Jump to content

పుట:చంద్రభానుచరిత్రము (తరిగొప్పుల మల్లన).pdf/110

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

జననాథచంద్ర యేమని, వినిపించెద మున్ను నిన్ను వీణారతునిం
గనుఁగొని కుముదిని యట వో, యినమొదలుం దాల్మి దూలి హెచ్చినకూర్మిన్.

129


సీ.

మలయానిలంబు పైఁబొలసిన నీభుజాపన్నగంబుల మది నెన్నునయ్య
కమలకాండములు పైఁగ్రమ్మిన నీయాననేందుమండలము నూహించునయ్య
వదరుతుమ్మెదలు పైవ్రాల నీనాసికావికచచంపకము భావించునయ్య
రాయంచపదువు లాఱడి పెట్ట నీకుంతలఘనాఘనములఁ దలంచునయ్య
బ్రమసి యూరక పనిలేనిపనికిఁ గూర్మి, చెలియఁ జీరెదనని నిన్నుఁ జీరునయ్య
చిత్రఫలకంబుపై నలచిత్తజాతు, వ్రాయఁ దలపోసి నీరూపు వ్రాయునయ్య.

130


ఉ.

చక్కెరబొమ్మ కొమ్మ యెలజవ్వని యచ్చట నిట్లు గుంద నీ
విక్కడ నుందువయ్య చెలి యీలువుదూలి మనోజుగాసిచేఁ
జిక్కెఁగదయ్య యింతపని సేయుదు రయ్య యిఁ కేమి సేయునో
చుక్కలరాజు వేఁడితల సూపెను రాగదవయ్య మ్రొక్కెదన్.

131


[1]మ.

అని పల్క న్విని చంద్రభానువసుధాధ్యక్షుండు సంతోషనీ
రనిధిం దేలుచు నోలతాంగి యిపు డేఁ బ్రచ్ఛన్నవేషంబుతో
నునికిం జేసి యథేచ్ఛఁ [2]జేర నది నీ వూహించి యేవేళ నీ
కనుకూలం బగు నట్టివేళ ననుడాయ న్వచ్చి పల్కించినన్.

132


క.

హరి రుక్మిణిఁ బలె నేనుం, దరుణీమణిఁ గొంచు శత్రుదమనుఁడనై మా
పురి కేగెద మది నీ వొం, డరయక పరికింపు మట్టియవకాశంబున్.

133


చ.

అని పతి వెండియుం బలుకు నంగన నా తెఱఁ గానుపూర్విగా
వనితకుఁ దెల్పు మేను దనవాఁడ సుమీ యనిపల్కు నాపయిం
దనదయ యుండనిమ్మనుము దైవికమై యితరేతరంబు హె
చ్చినతమి నెట్టులైన దరిఁ జేర్చు నదృష్ట మటంచుఁ జెప్పుమీ.

134


చ.

తరళిక నీవు వచ్చి కడుఁ దామస మయ్యెను దమ్మికంటి లో
విరహదవానలంబు కడువెగ్గలమైన సహింప కేగతిం
బొరయుచునున్నదో మగిడిపొ మ్మని యూర్మికఁ జేతి కిచ్చినన్
దరుణి జొహారు దేవ యని తన్మణిముద్రికఁ గొంచు గొబ్బునన్.

135


శా.

ఆలీలావనవాటిఁ బాసి తరుణీహర్మ్యంబు సొత్తించి యా
నాళీకాక్షికి లేమ తాఁ జనినచందం బంతయుం దన్మహీ

  1. ట-లో నీపద్యమునకు మాఱుగ "అనిన విని" యని వచనము గలదు.
  2. చ-రాఁజనదు